E-Paper
Advertisement

Crime Drama OTT : పక్కింటావిడతో భర్త సరసాలు… ఆ భార్య ఇచ్చే షాక్ కు దిమాక్ ఖరాబ్

Crime Drama OTT : పక్కింటావిడతో భర్త సరసాలు… ఆ భార్య ఇచ్చే షాక్ కు దిమాక్ ఖరాబ్
Advertisement

Crime Drama OTT : డార్క్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఓ మంచి మూవీ సజెషన్ తీసుకొచ్చాము. కానీ ఈ మూవీని గంటల తరబడి చూడాల్సిన అవసరం లేదు. పైగా ఓ ఓటీటీలోనూ సబ్స్క్రిప్షన్ అక్కర్లేదు. మరి ఆ మూవీ ఏంటి ? ఫ్రీగా ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

స్ట్రీమింగ్ ఫ్రీ

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మూవీ గురించి కాదు ఒక షార్ట్ ఫిల్మ్ గురించి. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ‘చట్నీ’ (Chutney). 2016లో వచ్చిన ఈ మూవీకి జ్యోతి కపూర్ దాస్ దర్శకత్వం చేశారు. ఈ 17 నిమిషాల హిందీ షార్ట్ ఫిల్మ్ ను టిస్కా చోప్రా నిర్మించారు. టిస్కా చోప్రా, అవ్నీష్ మిశ్రాతో కలిసి స్క్రిప్ట్ రాయగా, ఇందులో టిస్కా చోప్రా, రసికా దుగల్, అదిల్ హుస్సేన్, సుమిత్ గులాటి ప్రధాన పాత్రలు పోషించారు. రాయల్ స్టాగ్ బారెల్ సెలెక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ సిరీస్‌ లో భాగంగా ఈ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేశారు. ఈ రివేంజ్ డ్రామాలో టిస్కా చోప్రా పర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. ప్రస్తుతం యూట్యూబ్‌ లో దీన్ని ఫ్రీగానే చూడొచ్చు. లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ చానల్‌ లో ఫుల్ షార్ట్ ఫిల్మ్ అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  వింత రింగ్ పెట్టుకుని వేటాడే సైకో… ముసుగు వేసుకుని అమ్మాయిల మర్డర్స్… ఇంత బ్రూటల్ గా ఉన్నాడేంటి భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

మిడిల్ క్లాస్ హౌస్‌వైఫ్ వనితా (టిస్కా చోప్రా) పాత్ర ఇందులో మెయిన్. ఎందుకంటే స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఘజియాబాద్ నుండి వచ్చిన లేడీ ఆమె. తన భర్తతో కలిసి ఆమె ఒక కిట్టీ పార్టీకి వెళ్తుంది. అయితే అదే పార్టీలో ఆమె హస్బండ్‌ తో మరో అమ్మాయి ఫ్లర్ట్ చేయడం చూస్తుంది. ఆమె తన పక్కింట్లో ఉండే గ్లామరస్ నైబర్ రసికా (రసికా దుగల్) అని తెలుసుకుంటుంది. కానీ ఇదంతా చూశాక కూడా ఆమె ఆ అమ్మాయిని ఒక్క మాట అనదు. కానీ మరుసటి రోజు ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది.

Advertisement

ఆమెకు నచ్చిన వంటలు నేర్పిస్తానని చెబుతుంది. ఆ అమ్మాయి కూడా నో చెప్పకుండా చెప్పినట్టుగానే టైమ్ కి వనిత ఇంటికి వస్తుంది. ఇక ఆ పిల్ల రాగానే సాదరంగా ఆహ్వానించి… చట్నీ, పకోడాలు సర్వ్ చేస్తుంది. తన చట్నీ రెసిపీ సీక్రెట్ చెబుతానని నెమ్మదిగా కథ స్టార్ట్ చేస్తుంది. ఆమెకు బుద్ధి చెప్పడానికి తన పాత సర్వెంట్ కథను చెబుతుంది. దాని క్లైమాక్స్ విని రసికా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ సర్వెంట్ స్టోరీకి, ఇప్పుడు ఆమె తిన్న చట్నీకి ఒక షాకింగ్ లింకు ఉంటుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి ? చట్నీకి, అతనికి ఏంటి సంబంధం ? చివర్లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్న విషయాలను మూవీని చూసి తెలుసుకోవలసిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×