E-Paper
Advertisement

మోస్ట్ కాంట్రవర్షియల్ మలయాళం మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

మోస్ట్ కాంట్రవర్షియల్ మలయాళం మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?
Advertisement

Malayalam Times OTT: సినిమాలపై కాంట్రవర్సీ క్రియేట్ అయితే మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. అలాంటి సినిమాలను థియేటర్లలోనే మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటారు. అదే ఓటీటీలోకి వస్తే వదిలి పెడతారా ? తాజాగా ఓ క్రేజీ కాంట్రవర్సీ మలయాళం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. ‘మలయాళం టైమ్స్’ (Malayalam Times) అనే టైటిల్ తో మలయాళ సినిమా ప్రపంచంలోని ఆడంబరం వెనుక దాగి ఉన్న నిజాలను కామెడిగా బయట పెట్టిన ఈ సినిమాను ఏ ఓటీటీలో ఎప్పుడు చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వంలో వచ్చి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీకి సిద్ధమైంది. సినిమా పరిశ్రమలోని రాజకీయాలు, కళాత్మక సవాళ్లు, వ్యక్తిగత పోరాటాలను డార్క్ కామెడీ స్టైల్‌లో చూపించిన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించిన అప్డేట్ రావడం ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసింది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (JioHotstar) లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కుట్టిక్కానంకు చెందిన వినీత్ మాధవన్ అనే యువకుడి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఎం. నైట్ శ్యామలన్ స్ఫూర్తితో మలయాళ సినిమా పరిశ్రమలో అతిపెద్ద హారర్ డైరెక్టర్ కావాలనేది అతని కల. తండ్రి పదేపదే హెచ్చరించినా, పరిశ్రమలోని కఠోర వాస్తవాలను పట్టించుకోకుండా వినీత్ సినిమా రంగంలోకి అడుగు పెడతాడు. షార్ట్ ఫిల్మ్ లతో కెరీర్ ను మొదలుపెట్టి, క్రమంగా ఒక పూర్తి నిడివి సినిమాకి దర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంటాడు.

కానీ పోటీతో కూడిన సినిమా ప్రపంచంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఎన్నో. రాజకీయాలు, సృజనాత్మక విభేదాలు, క్రెడిట్ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు… అన్నీ అన్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. చివరికి వినీత్ తన డ్రీమ్స్ ను నెరవేర్చుకున్నాడా లేదా ? లేదంటే పరిశ్రమ రాజకీయాలకు బలయ్యాడా ? అనేది మూవీ స్టోరీ.

మూవీ వివాదాలు

Advertisement

ఈ సినిమా విడుదల సమయంలో చిక్కుల్లో పడింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలను, కొంతమంది నిర్మాతలు, నటుల ప్రవర్తనను ఇందులో ఎత్తి చూపించారు అంటూ కొంతమంది సీనియర్ ఫిల్మ్‌మేకర్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు. అలాగే కొన్ని సన్నివేశాలు నిజమైన సినిమా వ్యక్తులను టార్గెట్ చేసేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వివాదాలు సినిమా ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. మూవీ విడుదల అయ్యాక సెన్సార్ కట్లను బేఖాతరు చేసి, మూవీని అభ్యంతరకర పదాలతో విడుదల చేశారనే వివాదం చెలరేగింది.

Read Also : అండర్‌వరల్డ్ డాన్‌గా మారే కబడ్డీ ఆటగాడు… ఈ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×