E-Paper
Advertisement

Mystery Thriller Movie In OTT : అడవిలో అంతుచిక్కని మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్..?

Mystery Thriller Movie In OTT : అడవిలో అంతుచిక్కని మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్..?
Advertisement

Mystery Thriller Movie In OTT : ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వడం కన్నా ఓటీటీలోనే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఆ సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. మర్డర్ మిస్టరీ సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. తాజాగా ఓ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. అడవి నేపథ్యంలో సాగే ఈ మూవీ ఒక కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అది కూడా లేడీ కానిస్టేబుల్ ఆ కేసును ఎలా డీల్ చేసిందని ఈ సినిమా.. మరి ఆ సినిమా ఏంటి? ఏ ఓటీటీలో కి రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు బిగ్ బాస్ ఫేమ్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు మూవీ కానిస్టేబుల్ కనకం డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తోన్నాడు.. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ మూవీలో ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రాబోతుందని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశార మేకర్స్.. కానిస్టేబుల్ కనకం ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఖాకీ డ్రెస్‌లో వర్ష బొల్లమ్మ సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. ఆమె వెనుక కొబ్బరి తోటల తో నిండిపోయిన ఓ ప్రాంతం కనిపించడం ఆసక్తిని పెంచుతుంది. ఒక అమ్మాయి అలాంటి ప్రాంతంలో ఉండటంతో సినిమా పై అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

Advertisement

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ సినిమా మొత్తం అడవి నేపథ్యంలో తెరకెక్కింది. అడవిగుట్ట మిస్టరీని కనకం అనే కానిస్టేబుల్ ఎలా సాల్వ్ చేసింది అన్నది సినిమాలో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగనున్నట్లు సమాచారం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టారు. త్వరలోనే ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల తో పాటు పలువురు టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్టులు కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది రిలీజైన శ్రీదేవి శోభన్‌ బాబు మూవీ తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ కుమార్ దిమ్మల.. ఈమె తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్‌, స్వాతిముత్యం , పుష్పక విమానంతో పాటు సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవ కోన సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తెలుగులోనే కాదు తమిళం, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది. ఆ సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. తెలుగులో కూడా వరుస అవకాశాలు ఆమెను పలకరిస్తున్నాయి. ఇక ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే వాటి గురించి ప్రకటించనుంది..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×