E-Paper
Advertisement

Comedy Web Series OTT : ఓటీటీలోకి తమిళ కామెడీ వెబ్ సిరీస్… నవ్వు తెప్పిస్తున్న స్నేహితుల అల్లరి… ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Comedy Web Series OTT : ఓటీటీలోకి తమిళ కామెడీ వెబ్ సిరీస్… నవ్వు తెప్పిస్తున్న స్నేహితుల అల్లరి… ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?
Advertisement

Comedy Web Series OTT : ఈ డిజిటల్ యుగంలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సందడి చేస్తోంది. ఇక వీటిని భాషతో కూడా సంబంధం లేకుండా తెగ చూస్తున్నారు ప్రేక్షకులు. కామెడీ, హారర్ స్టోరీలను అస్సలు వదలట్లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి ఒక తమిళ కామెడీ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ సిరీస్ కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఓ పాత పత్రికను నిలబెట్టే క్రమంలో ఈ కథ అటు ఆసక్తిగా, ఇటు కామెడిగా సాగుతూ ఉంటుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

తమిళ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘లోకల్ టైమ్స్’ (Local Times). దీనికి నవీన్ జార్జ్ థామస్ దర్శకత్వం వహించారు. రిషికాంత్, అబ్దుల్ లీ, మౌరిష్ దాస్, అద్విత ఆరుముగం, ఆర్. పాండియరాజన్, చిన్ని జయంత్, నందిత శ్రీకుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ మార్చి 13 నుండి ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ అయిన ఈ సిరీస్‌లోని ఏడు ఎపిసోడ్‌లు, ఒకే రోజు విడుదల అయ్యాయి కూడా. ఈ తమిళ సిరీస్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వీర అనే యువకుడు తన తాతయ్య కాలం నాటి ‘నమ్మ సెయిది’ అనే పత్రికను నడుపుతుంటాడు. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం కావడంతో, ఆ పాత పేపర్ని ఎవరూ పట్టించుకోక ఆఫీసు మూతపడే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో వీర తన ముగ్గురు స్నేహితులు.. అళగు, వల్లి, ముత్తులను కలుపుకుని, ఆ పత్రికను ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ నలుగురు స్నేహితులు కలిసి ఆ పాత పత్రికకు కొత్త రూపు ఇచ్చే క్రమంలో ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, లోకల్ రాజకీయాలు, వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే ఈ సిరీస్ కథ. పత్రికను నిలబెట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని సార్లు ఆలోచింపజేస్తాయి. చివరికి వీళ్ళంతా ఆ పత్రికను నిలబెడతారా ? లేక తగలెడతారా ? అనే విషయాలను ఈ తమిళ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also :  ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ సిరీస్… నకిలీ పాస్‌పోర్ట్‌ల తయారీ చుట్టూ క్రేజీ గా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×