// // పెళ్లి వద్దు... మా ఇంటికి ఆడోళ్లే వద్దనే ముగ్గురన్నదమ్ములు... -->
E-Paper
Advertisement

పెళ్లి వద్దు… మా ఇంటికి ఆడోళ్లే వద్దనే ముగ్గురన్నదమ్ములు… ఓటీటీలో నవ్వించి చంపేస్తున్న కామెడీ సినిమా

పెళ్లి వద్దు… మా ఇంటికి ఆడోళ్లే వద్దనే ముగ్గురన్నదమ్ములు… ఓటీటీలో నవ్వించి చంపేస్తున్న కామెడీ సినిమా
Advertisement

Comedy Movie OTT : ఓటీటీలోకి రీసెంట్ గా ఒక మరాఠీ కామెడీ సినిమా వచ్చింది. ఇది ప్రేక్షకులను తెగ నవ్విస్తోంది కూడా. ముగ్గురు ముసలి బ్రహ్మచారి అన్నదమ్ముల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అమ్మాయి అంటే ఆమడ దూరం పరిగెడుతుంటారు వీళ్ళు. వీళ్ళ లైఫ్ లో అసలు ఆడదా నికి ఎంట్రీనే లేదు. అయితే మధ్యలో ఒక అమ్మాయి ఆత్మ ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది ఇప్పుడు. చూస్తే పడి పడి నవ్వుతారు కూడా. వీకెండ్ ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్.

ప్రైమ్ వీడియో (Prime Video) లో స్ట్రీమింగ్

ఈ మరాఠీ కామెడీ డ్రామా పేరు ‘పున్హా ఏక్దా సాడే మాడే తీన్’ (Punha Ekda Sade Made Teen). ఇది 2007లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘సాడే మాడే తీన్’కు సీక్వెల్. అంకుష్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, మళ్ళీ ఆ ముగ్గురు అన్నదమ్ముల (కుర్లే బ్రదర్స్) సరదా కథను మన ముందుకు తెచ్చింది. ఇందులో కూడా అశోక్ సరాఫ్ (రతన్), మకరంద్ అనాస్పురే (మదన్), భరత్ జాదవ్ (చందన్) అన్నదమ్ములుగా నటించారు. హీరోయిన్ రింకూ రాజ్‌ ఇందులో కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది దీనికి. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియో (Prime Video) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో రతన్ దాదా (అశోక్ సరాఫ్), మదన్ (మకరంద్ అనాస్పురే), చందన్ (భరత్ జాదవ్) అనే కుర్లే బ్రదర్స్ తమ గ్యారేజీని నడుపుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఆడవాళ్లు వద్దు, పెళ్లి వద్దు అనే పాత నియమాన్నే పాటిస్తూ ఉంటారు. అయితే అసలు ట్విస్ట్ ఒక వర్షం కురిసే రాత్రి వస్తుంది. కామిని (రింకూ రాజ్‌గురు) అనే అమ్మాయి గ్యాంగ్ స్టార్ల నుండి తప్పించుకోవడానికి వాళ్ళ గ్యారేజీలోకి వస్తుంది. చందన్ ఆమెకు ఆశ్రయం ఇస్తాడు. అయితే కొద్దిసేపటికే మదన్, చందన్‌లకు ఒక షాకింగ్ విషయం అర్థమవుతుంది. కామిని కేవలం మనుషులకు కనిపించే సాధారణ అమ్మాయి కాదు, ఆమె ఒక ఆత్మ. విచిత్రమేమిటంటే ఆమెను మదన్ చూడగలడు, చందన్ ఆమె మాటలను వినగలడు, కానీ రతన్ దాదాకు ఆమె అస్సలు కనబడదు.

స్టోరీ ఇప్పుడు గతానికి వెళ్తుంది. కామిని నిజానికి ఒక ధనవంతురాలు. తన కాలేజీ రోజుల్లో రోహన్ మ్హాత్రే అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకుంటాడు. కేవలం ఆమె ఆస్తి కోసమే రోహన్ తన ప్రియురాలితో కలిసి కామినిని హత్య చేస్తాడు. చనిపోయిన తర్వాత ఆత్మగా మారిన కామిని, తన హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి తన తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి ఈ ముగ్గురు అన్నదమ్ముల సహాయం కోరుతుంది. ఆడవాళ్లంటేనే భయపడే ఈ అన్నదమ్ములు, మొదట కామినిని చూసి భయపడి బాబా ఖత్రి అనే మాంత్రికుడి సహాయం కోరతారు. కానీ ఆమె పడ్డ కష్టాలను తెలుసుకున్నాక, ఆమెకు న్యాయం చేయాలని నిర్ణయించుకుంటారు. చివరికి కామినికి ఈ ఆన్నదమ్ములు న్యాయం చేస్తారా ? వీళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : పుట్టినరోజునే చావు కేకలు… ప్రతిరోజు చచ్చి బతికే అమ్మాయి… బుర్ర హీటెక్కించే టైమ్ లూప్ కాన్సెప్ట్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×