E-Paper
Advertisement

లోకం మెచ్చిన అబద్ధం.. నవ్వుల పాలైన జీవితం… ఓటీటీలో ఆకట్టుకుంటున్న క్రేజీ కామెడీ

లోకం మెచ్చిన అబద్ధం.. నవ్వుల పాలైన జీవితం… ఓటీటీలో ఆకట్టుకుంటున్న క్రేజీ కామెడీ
Advertisement

Comedy Movie OTT : కంటెంట్ మంచిగా ఉండాలే గాని, సినిమా ఏ భాషలో వస్తే ఏముంది చెప్పండి. ఈ క్రమంలో ఇండోనేషియా ఒక సరికొత్త సినిమాతో ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేస్తోంది. గత ఏడాది వచ్చిన ఈ డార్క్ కామెడీ సినిమా ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. సానుభూతికి మనిషి ఎలా బానిస అవుతాడనే అంశాన్ని ఇందులో వ్యంగ్యంగా చూపించారు. ముఖ్యంగా నేటి కాలంలో ఇతరుల గుర్తింపు కోసం మనుషులు ఎంతలా దిగజారుతారనే విషయాన్ని ఈ చిత్రం ఒక సెటైర్‌లా మన ముందు ఉంచుతుంది. ఫ్యామిలీతో ఈ సినిమాను వీకెండ్ ఎంచక్కా చూసేయండి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

2025లో వచ్చిన ఈ ఇండోనేషియా క్రేజీ కామెడీ మూవీ పేరు ‘బెటర్ ఆఫ్ డెడ్’ (Better Off Dead). ప్రముఖ ఇండోనేషియా హాస్య నటుడు ఎర్నెస్ట్ ప్రకాశ తన ‘ఇమాజినారి’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్టో ఇమ్మాన్యుయేల్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో ఒమారా ఎస్టెఘ్లాల్, నిరినా జుబీర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మనిషికి ఉండే గుర్తింపు పిచ్చిని పాయింట్ గా చేసుకుని తీసిన ఈ ‘క్రింజ్ కామెడీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ సౌండ్ విభాగాల్లో నామినేషన్లు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 20వ జోగ్జా-నెట్‌పాక్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా ‘బెస్ట్ ఫిలిం’ అవార్డుతో పాటు మరో నాలుగు పురస్కారాలను గెలుచుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన తర్వాత, ఈ చిత్రం 2025 డిసెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

గెమా అనే ఒక యువకుడు ఆఫీసులో అందరిలాగే సాదాసీదాగా బతుకుతుంటాడు. అతన్ని ఎవరూ పెద్దగా గుర్తించరు. అయినా సరే బండి అలా లాగిస్తుంటాడు. అలాంటి సమయంలో అతని తండ్రి చనిపోవడంతో, ఆఫీసులో తోటి ఉద్యోగులందరూ అతనిపై అమితమైన జాలి, సానుభూతి చూపిస్తారు. జీవితంలో ఎప్పుడూ లేని విధంగా అందరి దృష్టి తనపై పడేసరికి, గెమాకు ఆ ఫీలింగ్ చాలా కొత్తగా, ఆనందంగా అనిపిస్తుంది.
అయితే కొద్దిరోజుల తర్వాత ఆ సానుభూతి తగ్గిపోవడం మొదలవుతుంది. మళ్ళీ తనని ఎవరూ పట్టించుకోరేమో అన్న భయంతో, ఆ గుర్తింపును కాపాడుకోవడానికి గెమా అబద్ధాలు చెప్పడం మొదలుపెడతాడు.

అయితే ఒక చిన్న అబద్ధం కాస్తా పెద్దదిగా మారి, అతన్ని ఊహించని సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఆ అటెన్షన్ కోసం అతను చేసే పనులు నవ్వు తెప్పిస్తూనే, పరిస్థితిని ఎంతవరకు తీసుకెళ్లాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. గుర్తింపు కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడు అనే పాయింట్‌ను ఈ సినిమాలో కామెడీగా చూపించారు. చివరికి గెమా ఆడిన అబద్ధాలు ఎలా బయటపడ్డాయి ? ఆ తర్వాత అతని పరిస్థితి ఏమైంది అనే విషయాలతో ఈ సినిమా మరింత కామెడీగా ముగుస్తుంది.

Advertisement

Read Also : మార్చురీ నుండి మాయమైన మృతదేహం…క్లైమాక్స్ లో ఊహించని షాకింగ్ ట్విస్ట్… ఐయండిబిలో 7.6 రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×