E-Paper
Advertisement

Comedy Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరాఠి హిట్ మూవీ… పొట్ట చెక్కలయ్యే అత్తా కోడళ్ళ కామెడీ… ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Comedy Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరాఠి హిట్ మూవీ… పొట్ట చెక్కలయ్యే అత్తా కోడళ్ళ కామెడీ… ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
Advertisement

Comedy Movie OTT : థియేటర్లలో రీసెంట్ గా, ఒక మరాఠీ కామెడీ ఫ్యామిలీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అత్త కోడళ్ళ పోరు మధ్య సాగే ఈ సినిమా కథ సరికొత్తగా తెరకెక్కింది. మంచి మ్యూజిక్, ఆకట్టుకునే కథతో ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. కామెడీ అయితే కెవ్వు కేక అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధం అయిపోయింది. ఈ మరాఠీ సినిమా పేరు ఏమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ మరాఠీ ఫ్యామిలీ కామెడీ సినిమా పేరు ‘అగా అగా సున్‌బాయ్! కే మ్హంతే సాసుబాయ్?’ (Aga Aga Sunbai! Kay Mhantay Sasubai?). ఇది 2026 జనవరి 16న థియేటర్లలో విడుదలైన ఒక కామెడీ చిత్రం. ప్రముఖ దర్శకుడు కేదార్ షిండే దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో నిర్మితి సావంత్ (అత్తగారి పాత్రలో), ప్రార్థన బెహెరే (కోడలి పాత్రలో) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 10 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన తర్వాత, ఈ సినిమా మార్చి 19 నుండి ZEE5 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులోకి వస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా ఒక ఇంట్లోని అత్తాకోడళ్ల రచ్చ చుట్టూ తిరుగుతుంది. అత్తమ్మ స్మితా దేశాయ్ (నిర్మితి సావంత్) పాత పద్ధతులు ఫాలో అయ్యే గడుసు మనిషి. కోడలు మానస్వి (ప్రార్థన బెహెరే) ఏమో ఈ తరం పిల్ల. ఇద్దరికీ అస్సలు పడదు, ఎప్పుడూ కుక్కా పిల్లిలా కొట్టుకుంటూనే ఉంటారు. అత్తమ్మ పెట్టే టార్చర్‌ భరించలేక, మొగుడిని ఒప్పించి కోడలు పక్కా ప్లాన్‌తో వేరే కాపురం పెట్టేస్తుంది. హమ్మయ్య దెయ్యాన్ని వదిలించుకున్నాం అనుకుని కోడలు హాయిగా ఎంజాయ్ చేస్తున్న టైమ్‌లో సీన్ రివర్స్ అవుతుంది.

ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి అత్తమ్మ హాస్పిటల్ పాలవుతుంది. అప్పుడు గత్యంతరం లేక మళ్లీ అత్తమ్మను తన ఇంటికే తెచ్చుకోవాల్సి వస్తుంది కోడలికి. ఒకే ఇంట్లో ఉంటూనే ఒకరినొకరు ఏడిపించుకోవడం, పాత గొడవలు తవ్వుకోవడం లాంటివి భలే కామెడీగా ఉంటాయి. కానీ కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు ఎలా తోడు నిలబడ్డారు, ఆ గొడవల వెనుక ఉన్న ప్రేమ ఏంటనేది సినిమా చివర్లో హార్ట్ టచింగ్‌గా చూపించారు.

Advertisement

Read Also : భార్య అందగత్తె… భర్త మాత్రం మరో మహిళతో… సినిమా ఉంటుంది మావా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×