E-Paper
Advertisement

Comedy Horror OTT : సమాధుల మీద కొత్త హోటల్ … దెయ్యాల దెబ్బతో రచ్చ రచ్చ… నవ్వులు పూయిస్తున్న హారర్ స్టోరీ

Comedy Horror OTT : సమాధుల మీద కొత్త హోటల్ … దెయ్యాల దెబ్బతో రచ్చ రచ్చ… నవ్వులు పూయిస్తున్న హారర్ స్టోరీ
Advertisement

Comedy Horror OTT : కడుపుబ్బ నవ్వించడంలో హారర్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ బాగా అదరిస్తారు కూడా. పైగా వీటిని ఏ భాషలో వచ్చినా చూస్తుంటారు. రీసెంట్ గా వచ్చిన ‘సు ఫ్రమ్ సో’ నుంచి ‘సర్వం మాయ’ వరకు తెగ నవ్వించాయి కూడా. ఈ నేపథ్యంలో ఒక బెంగాల్‌లో హారర్ కామెడీ మూవీ కూడా నవ్వులు పూయిస్తోంది. ఒక పాత స్మశానంపై కట్టిన భానుప్రియ అనే లగ్జరీ హోటల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అక్కడకు వచ్చే అతిథులకు ఎదురయ్యే వింత అనుభవాలు, దయ్యాలతో కూడిన ఫన్నీ సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా బెంగాల్‌లోని అందమైన పర్వత ప్రాంతంలో జరిగింది. మంచు కొండలు, అక్కడి చలి వాతావరణం సినిమాలోని హారర్ మూడ్‌కు బాగా సెట్ అయ్యాయి కూడా.

జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ బెంగాలీ హారర్ కామెడీ పేరు ‘భానుప్రియ భూతర్ హోటల్’ (Bhanupriya Bhooter Hotel). ఈ సినిమాను బెంగాలీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన విండోస్ ప్రొడక్షన్ నిర్మించింది. అరిత్ర ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించారు. మిమీ చక్రవర్తి, సోహమ్ మజుందార్, బోనీ సేన్‌గుప్తా, స్వస్తిక దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2026 జనవరి 23న థియేటర్లలో విడుదలైంది. దాదాపు మూడు వారాల తర్వాత ఫిబ్రవరి 13 నుండి ZEE5 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెంగాల్‌లోని ఒక కొండల ప్రాంతంలో ఒక పాత శ్మశానాన్ని పడగొట్టి, దాని మీద భానుప్రియ అనే ఒక ఖరీదైన హోటల్ కడతారు. ఆ హోటల్ ఓనర్ భానుప్రియ (మిమీ చక్రవర్తి) దాన్ని ఎలాగైనా క్లిక్ చేయించాలని ప్లాన్ చేస్తుంది. కానీ పాపం, ఆ హోటల్ కింద ఉన్న సమాధుల్లోని దయ్యాలకు తమ గూడు పోయిందని కోపం వస్తుంది. హోటల్ ఓపెన్ చేసినప్పటి నుండి అక్కడకు వచ్చే గెస్టులకు ఈ దయ్యాలు చుక్కలు చూపిస్తుంటాయి. అయితే అది హారర్ లా కాకుండా ఫుల్ కామెడీగా సాగుతుంది. ఈ గందరగోళం మధ్యలోకి అరణ్య (సోహమ్ మజుందార్) అనే ఒక తెలివైన లాయర్ వస్తాడు. అసలు ఆ హోటల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చి, తనే ఆ దయ్యాల తిప్పల్లో పడతాడు.

ఒక పక్క హోటల్ బిజినెస్ కాపాడుకోవాలని భానుప్రియ తాపత్రయం, మరోపక్క తమ జాగాని వదిలేది లేదని దయ్యాల మొండితనం మధ్య జరిగే గొడవలతో వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. క్లైమాక్స్‌లో అయితే సీన్ మొత్తం కోర్టులోకి వెళ్తుంది. మనుషులకే కాకుండా, ఆ చనిపోయిన దయ్యాలకు కూడా ఆస్తి హక్కులు ఉంటాయని, వాటికి కూడా న్యాయం జరగాలని లాయర్ వాదిస్తాడు. దయ్యాలు, మనుషులు కలిసి కోర్టులో కొట్లాడుకోవడం ఈ సినిమాలోని అసలైన ట్విస్ట్. చివరికి ఆ హోటల్ ఏమైంది ? దయ్యాలు శాంతించాయా ? వాటికి న్యాయం జరిగిందా అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  తమ్ముడి జోలికొస్తే తలలు తీసే అన్న… ఐయండిబిలో 7.5 రేటింగ్…ఇదో ఆగని ప్రతీకార సెగ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×