E-Paper
Advertisement

Comedy Drama OTT : తెల్లారితే పెళ్లి… నైట్ కి నైట్ వధూవరులు జంప్… కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ

Comedy Drama OTT : తెల్లారితే పెళ్లి… నైట్ కి నైట్ వధూవరులు జంప్… కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ
Advertisement

Comedy Drama OTT : ‘మత్తు వదలరా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సింహా కోడూరి హీరోగా చేసిన రెండో సినిమా ‘తెల్లవారితే గురువారం’. సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం. కీర‌వాణి కుమారుడు అయిన ఈ హీరో గారు మొదటి సినిమాతో పర్లేదనిపించాడు. రెండో సినిమాలో యాక్షన్ జోలికి వెళ్ళకుండా లవ్ ట్రాక్ లోనే బండి నడిపాడు. పెళ్లి రోజే ఇంట్లోనుంచి పారిపోయే సీన్ తో స్టోరీ మొదలవుతుంది. లవ్, కామెడీ థీమ్స్ తో సరదాగా సాగిపోయే ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? వీళ్ళు ఎందుకు పారిపోయారు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘తెల్లవారితే గురువారం’ (Thellavarithe guruvaram) తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా 2021 మార్చి 27న విడుదలైంది. వారాహి చలన చిత్రం, లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు మణికాంత్ జెల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీ సింహా, చిత్ర శుక్ల, మిషా నారంగ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు. ప్రస్తుతం Airtel xstream, Jio hotstar ప్లాట్ ఫామ్ లలో ఈ కామెడీ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : నిమిషానికో ట్విస్ట్… ఈ సిరీస్ ను చూశాక డాక్టర్లకు దండం పెడతారు… కే-డ్రామా లవర్స్ డోంట్ మిస్

స్టోరీ ఏమిటంటే

వీరేంద్ర (సింహా) ఒక కన్ష్ట్రక్షన్ లో ఇంజనీర్ గా పని చేస్తుంటాడు. అతడికి మధు (మిష నారంగ్) అనే అమ్మాయితో పెద్దలు పెళ్లి నిర్ణయిస్తారు. అయితే ఇద్దరికీ ఇష్టం లేకపోయినా పెళ్లికి సిద్ధమైపోతారు. తెల్లారితే పెళ్లి అనుకుంటున్న సమయంలో ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు పెళ్లికొడుకు వీరేంద్ర. అదే సమయంలో బ్యాగ్ పట్టుకుని పెళ్లి కూతురు మధు కూడా బయటికి వస్తుంది. ఇద్దరూ ఒక చోట కలుసుకుంటారు. ఆ సమయంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అయితే వీరేంద్ర ప్రేమ కథలో కృష్ణవేణి (చిత్రా శుక్లా) అనే అమ్మాయి ఉంటుంది. ఆమెను ప్రాణంగా ప్రేమించినందునే పెళ్లి నుంచి పారిపోతున్నట్లు చెప్తాడు వీరేంద్ర. ఇక ఆమెను కలుసుకోవడానికి కూడా వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్లిన తర్వాత మైండ్ బెండ్ అయ్యే ట్విస్ట్ వస్తుంది. దీంతో వీరేంద్రకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి ? మధు స్టోరీ ఏమిటి ? వీరేంద్ర పెళ్లి ఎవరితో జరుగుతుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×