E-Paper
Advertisement

Comedy drama OTT: పెళ్ళైనా ఆ పనికి నోచుకోని జంట…మరో అమ్మాయితో అలాంటి పని… క్లైమాక్స్ కేక

Comedy drama OTT: పెళ్ళైనా ఆ పనికి నోచుకోని జంట…మరో అమ్మాయితో అలాంటి పని… క్లైమాక్స్ కేక
Advertisement

Comedy drama OTT : సంతానం లేకపోవడం వల్ల వచ్చే మానసిక సమస్య గురించి మాటల్లో చెప్పలేము. ఆ బాధను వర్ణించలేము కూడా. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ మూవీ తెరకెక్కింది. అయితే ఈ సమస్యను ఎంతో నిజాయితీగా, కామెడీతో కలిపి చూపించినందుకు దర్శకురాలిని చాలా మంది ప్రశంసించారు కూడా. ఈ సినిమా దర్శకురాలు తమరా జెంకిన్స్ తన సొంత జీవిత అనుభవాల ఆధారంగా ఈ కథను రాశారు. ఆమె కూడా సంతానం కోసం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు, అందుకే సినిమా అంత సహజంగా ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘ప్రైవేట్ లైఫ్’ (Private Life). 2018లో వచ్చిన ఈ సినిమాకు తమరా జెంకిన్స్ దర్శకత్వం వహించారు. ఇందులో పాల్ గియామట్టి, కాథరిన్ హాన్, కైలీ కార్టర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. న్యూయార్క్‌లో నివసించే ఒక జంట, సంతానం కోసం పడే కష్టాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రిచర్డ్, రాచెల్ అనే దంపతులు న్యూయార్క్‌లో నివసించే ఒక మధ్యతరగతి జంట. వాళ్ళకి పెళ్లై చాలా ఏళ్లయినా పిల్లలు మాత్రం పుట్టరు. ఆ లోటును తీర్చుకోవడానికి వాళ్ళు రకరకాల డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ చికిత్సలు చేయించుకుంటారు. ఆ ఇంజెక్షన్లు, మందుల వల్ల రాచెల్ ఆరోగ్యం దెబ్బతింటుంది తప్ప, వాటివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అలాగే ఆ చికిత్సల కోసం వాళ్ళ దగ్గరున్న డబ్బంతా కూడా ఖర్చయిపోతుంది. అయినా సరే ఎలాగైనా ఒక బిడ్డను పొందాలనే పట్టుదలతో వాళ్ళు పడే కష్టాలు చూడటానికి చాలా బాధగా అనిపిస్తాయి.

ఈ ప్రయత్నాల్లో విసిగిపోయిన వాళ్ళు చివరికి ఎగ్ డొనేషన్ వైపు మొగ్గు చూపుతారు. అంటే వేరే వాళ్ళ దగ్గర నుండి అండాన్ని తీసుకుని బిడ్డను కనాలన్నమాట. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ బంధువుల అమ్మాయి సాడీ వాళ్ళ ఇంటికి వస్తుంది. సాడీ చాలా తెలివైన పిల్ల, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో తన ఎగ్‌ని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. దీంతో రిచర్డ్, రాచెల్ జీవితాల్లో కొత్త ఆశలు మొదలవుతాయి. అయితే సాడీ ఇంట్లో దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీంతో స్టోరీ అనుకోని మలుపు తిరుగుతుంది. చివరికి ఈ జంటకి పిల్లలు పుడతారా ? అలాగే ఉండిపోతారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : పెళ్లి కొడుకుకు ట్విస్ట్ ఇచ్చే ప్రియురాలు … ఓటీటీలోకి వచ్చేస్తున్న బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ మూవీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×