E-Paper
Advertisement

Comedy Drama OTT : IMDbకి 9.6 రేటింగ్ ఉన్న డార్క్ కామెడీ డ్రామా… క్లైమాక్స్ వరకూ కితకితలే

Comedy Drama OTT : IMDbకి 9.6 రేటింగ్ ఉన్న డార్క్ కామెడీ డ్రామా… క్లైమాక్స్ వరకూ కితకితలే
Advertisement

Comedy Drama OTT : హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే ఇప్పుడు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఆసక్తికరమైన కంటెంట్ ఉండటం వల్ల నార్త్ ప్రేక్షకులు కూడా సౌత్ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక క్రైమ్ కామెడీ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను తెగ నవ్వించింది. అయితే ఈ సినిమాకి ఐయండిబిలో 9.6 రేటింగ్ ఉండటం విశేషం. ఈ సినిమాకి డిజిటల్ ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈ సినిమాపేరు ఏమిటంటే

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తెలుగు సినిమా పేరు “గుర్రం పాపి రెడ్డి”. టైటిల్ కు తగ్గట్టు స్టోరీ కూడా ఉంటుంది. ఇది డార్క్ కామెడీ జానర్ లో వచ్చింది. ఇందులో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి మురళి మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం న్యాయమూర్తిగా కూడా నటించారు. అంతేకాకుండా ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ కథ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని, విమర్శకులు కూడా ఈ సినిమాను ప్రశంసించారు. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే గుర్రం పాపిరెడ్డి ఓటీటీలోకి వచ్చింది. ఇది 2025 డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. జనవరి 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ.

Advertisement

Read Also :  కదిలే ట్రక్ లో శవం… ట్విస్టుల మీద ట్విస్టులు భయ్యా… మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్

సినిమా కథ

ఈ కథ గుర్రం పాపి రెడ్డి (నరేష్ అగస్త్య) పాత్ర చుట్టూ తిరుగుతుంది. గుర్రం పాపి రెడ్డి ఒక చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెడతాడు. అయితే అది కుప్పకూలిపోతుంది. అతను అప్పుల్లో చిక్కుకుంటాడు. అతను సౌదామిని (ఫరియా అబ్దుల్లా), మరో ముగ్గురు వ్యక్తులతో జతకడతాడు. డబ్బు కోసం పాపిరెడ్డి మరో అడ్డదారి వెతుక్కుంటాడు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నర్సుగా చేస్తున్న సౌదామిని తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. శ్రీశైలం నుండి ఒక మృతదేహాన్ని తీసుకురావడమే ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఒకే దారి. అయితే ఇది కనిపించేంత సులభం కాదు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తర్వాత, దానిని స్మశానవాటికలో ఖననం చేయాలి. ఈ సమయంలో వాళ్ళకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. చివరికి వీళ్లు శవాలను మార్చారా? వీళ్ళ కష్టాలు గట్టెక్కుతాయా ? వీళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×