E-Paper
Advertisement

ఎవరు నా అసలు నాన్న? ఇద్దరి తండ్రుల మధ్య నలిగిపోయే కూతురు… ఆకట్టుకుంటున్న స్టోరీ

ఎవరు నా అసలు నాన్న? ఇద్దరి తండ్రుల మధ్య నలిగిపోయే కూతురు… ఆకట్టుకుంటున్న స్టోరీ
Advertisement

Comedy Drama OTT : ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీలో ఒక సినిమాని తెగ చూశారు. ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాల లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమాను ఎక్కువగా బ్రెజిల్‌లోని అందమైన పల్లెటూళ్లలో చిత్రీకరించారు. అందుకే సినిమా అంతా చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. కంటెంట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో విచెంజా అనే 18 ఏళ్ల అమ్మాయి, తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో కథ చూసేందుకు కూడా చూడ చక్కగా అనిపిస్తుంది. అసలు ఇది బ్రెజిల్ సినిమా అయినా కూడా, ఇండియన్ స్టైల్ లో ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

2021లో వచ్చిన ఈ బ్రెజిలియన్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘డబుల్ డాడ్’ (Double Dad). ఇందులో మైసా సిల్వా, ఎడ్వర్డో మోస్కోవిస్, మార్సెలో మెడిసి లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాలో విచెంజా పాత్ర పోషించిన మైసా సిల్వా బ్రెజిల్‌లో చాలా పాపులర్. ఆమె చిన్నప్పటి నుండే టీవీ ప్రజెంటర్‌గా, నటిగా అక్కడి ప్రేక్షకులకు బాగా తెలుసు. ఈ సినిమా కేవలం 1 గంట 43 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌లో బోర్ కొట్టకుండా హాయిగా చూసేయొచ్చు. మీరు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు ఆడియోతో చూడవచ్చు. ఇది విడుదలైన సమయంలో బ్రెజిల్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 లిస్టులో నిలిచింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

విచెంజా అనే అమ్మాయి ఒక ఆశ్రమం లాంటి ప్రశాంతమైన చోట తన తల్లితో కలిసి పెరుగుతుంది. 18 ఏళ్లు వచ్చినా తన తండ్రి ఎవరో ఆమెకు తెలియదు. వాళ్ళ అమ్మ ఒక పని మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు, విచెంజా తన తండ్రిని వెతకాలని నిర్ణయించుకుంటుంది. తన తల్లి పాత వస్తువుల్లో దొరికిన ఆధారంతో తండ్రిని వెతుకుతూ సిటీకి ఒంటరిగా బయలుదేరుతుంది. అక్కడ ఆమెకు ఇద్దరు వ్యక్తులు తారసపడతారు. ఒకరు పాకో, స్వేచ్ఛగా బతికే ఒక ఆర్టిస్ట్. ఇంకొకరు జియోవన్నే, పద్ధతిగా ఉండే ఒక బిజినెస్ మేన్.

విచెంజా ఆ ఇద్దరినీ కలిసి తన తండ్రి ఎవరో తేల్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ ఇద్దరూ ఆమెను సొంత కూతురిలాగే భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటారు. దీంతో విచెంజాకు ఇద్దరు తండ్రులు దొరికినంత ఆనందం కలుగుతుంది. కథ చివర్లో వాళ్ళ అమ్మ తిరిగి రావడంతో అసలు విషయం బయటపడుతుంది. ఆ నిజం ఏమిటి ? విచెంజా అసలు తండ్రి ఎవరు ? ఆమె ఇద్దరినీ తండ్రులుగా స్వీకరిస్తుందా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న 26 ఏళ్ల హాలీవుడ్ మూవీ… యాక్టింగ్ ఇరగదీసిన బ్రాడ్ పిట్… ఐయండిబిలో 8.8 రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×