E-Paper
Advertisement

OTT Movie : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ

OTT Movie : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక మలయాళ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ట్విస్టులతో మతి పోగొడుతోంది. ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేలా ఈ కథ ఉంటుంది. ఈ కథ ఇద్దరు పోలీసులు ఒక దొంగను పట్టుకునందుకు ఒక గ్రామంలోకి వెళ్తారు. అయితే ఆ గ్రామ ఒక వింత ప్రపంచంలా ఉంటుంది. అక్కడినుంచి బయటికి రావడం, పద్మవ్యూహ్యం ట్విస్ట్ కి మించి ఉంటుంది. వాళ్ళు ఒక టైమ్ లూప్ లో చిక్కుకుపోతారు. ఈ సినిమా దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరీ తీసిన మరో సినిమా జల్లికట్టు (2019) 93వ అకాడెమీ అవార్డ్స్‌కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. కానీ అది చివరి రౌండ్‌లో అవార్డును దక్కించుకోలేక పోయింది. దీని తరువాత 2021లో ఆడియన్స్ కి మైండ్ మడత పెట్టిన ఈ మూవీ పేరు ‘చురులి’. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో ఉందంటే

‘చురులి’ (Churuli)  2021లో వచ్చిన మలయాళం సైన్స్ ఫిక్షన్ మిస్టరీ సినిమా. లిజో జోస్ పెల్లిస్సేరీ దీనికి దర్శకత్వం వహించారు ఇందులో వినాయ్ ఫోర్ట్, చెంబాన్ వినోద్, జోజు జార్జ్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరీ 11న రిలీజ్ అయింది. 2021 నవంబర్ 19 నుంచి SonyLIV ఓటీటీలో రిలీజ్ అయింది. IMDbలో దీనికి 7.0/10 రేటింగ్ కూడా ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

అంతోనీ, షాజివాన్ అనే ఇద్దరు పోలీసులు, జోయ్ అనే క్రిమినల్‌ను పట్టుకోవడానికి చురులి అనే గ్రామానికి వస్తారు. వాళ్లు తమ అసలు పేర్లు చెప్పకుండా, ఫేక్ పేర్లతో అక్కడికి వస్తారు. థాంకన్ అనే వ్యక్తి వాళ్లను గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ గ్రామంలోకి వెళ్లిన తర్వాత బయటకు రావడం కష్టమని చెబుతాడు. ఆ గ్రామం కూడా చాలా వింతగా, భయంకరంగా ఉంటుంది. అక్కడి వాళ్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇక అంతోనీ, షాజివాన్ ఇప్పుడు ఆ గ్రామంలో జోయ్‌ను వెతుకుతారు. కానీ ఆ దొంగ అంత తేలిగ్గా కనిపించడు.

Read Also : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Advertisement

ఆ గ్రామంలో ఉన్న మనుషులు చాలా రూడ్‌గా, వింతగా మాట్లాడతారు. అక్కడికి వెళ్ళాక బయటకు వెళ్లే దారి మాత్రం వీళ్ళు తెలుసుకోలేక పోతారు. వీళ్ళకు జోయ్‌ను వెతకడం కష్టమవుతుంది. ఆ గ్రామం ఒక వేరే లోకంలా, టైమ్ లూప్ లో ఉన్నట్లు ఉంటుంది. అంతోనీ, షాజివాన్ అక్కడే చిక్కుకుంటారు. జోయ్ గురించి ఒక సీక్రెట్ బయటపడుతుంది. అది మరో వింతలా అనిపిస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ కూడా గందరగోళంగానే ముగుస్తుంది. చివరికి ఈ పోలీసులు జోయ్ ని పట్టుకుంటారా ? వీళ్ళు ఆ టైమ్ లూప్ లో చిక్కుకుంటారా ? ఆ గ్రామం చరిత్ర ఏమిటి ? అనే విషయాలను, ఈ మలయాళం సైన్స్ ఫిక్షన్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×