E-Paper
Advertisement

Chiranjeevi MSG Movie: ఓటీటీలోనూ శంకర్ గారిదే హవా.. ఒక్క రోజులోనే?

Chiranjeevi MSG Movie: ఓటీటీలోనూ శంకర్ గారిదే హవా.. ఒక్క రోజులోనే?
Advertisement

Chiranjeevi MSG Movie:మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నయనతార(Nayanthara) హీరోయిన్గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్కు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అటు నయనతార హుందాతనం సినిమాకు మరింత క్రేజ్ ను అందించింది.

ఓటీటీలో సత్తా చాటుతున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ..

థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.375 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా.. చిరంజీవి కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. అలా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ Zee5 వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అయితే అక్కడ కూడా ఒక్క రోజులోనే రికార్డును సృష్టించింది మన శంకర వరప్రసాద్ గారు. కేవలం 24 గంటల్లోనే ఏకంగా 200 మిలియన్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇది ఒక కొత్త రికార్డు అని అటు Zee5 సంస్థ కూడా వెల్లడించింది. మొత్తానికైతే అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీలో కూడా ఈ సినిమా మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Ram Charan – Upasana: మెగా ట్విన్స్ పేర్ల వెనుక అసలైన న్యూమరాలజీ.. అందుకే ఆ పేర్లు పెట్టారా?

మీ ప్రేమే.. నా శక్తి..

ఇదిలా ఉండగా గతంలో ఇదే విషయంపై చిరంజీవి మాట్లాడుతూ.. వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్ , కొట్టే చప్పట్లే నన్ను నడిపించే ఒక శక్తి.. రికార్డులు వాటంతటవే వస్తూ ఉంటాయి..పోతూ ఉంటాయి. కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. అది శాశ్వతం అంటూ తెలిపారు. ఇకపోతే నయనతార హీరోయిన్గా కనిపించడమే కాకుండా తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది . పైగా వెంకటేష్(Venkatesh ) కీలక పాత్రలో కనిపించి నవ్వులు పూయించారు. వైవా హర్ష , హర్షవర్ధన్, కేథరిన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

చిరంజీవి తదుపరి మూవీ పూజా కార్యక్రమం అప్పుడే..

Advertisement

చిరంజీవి తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో బెంగాల్ మాఫియా నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఇందులో ప్రియమణిని హీరోయిన్గా.. సారా అర్జున్ ను చిరంజీవికి కూతురు పాత్రలో తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా అనడంతో అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×