E-Paper
Advertisement

కలల ప్రపంచంలో చిక్కుకుయే స్పేస్‌షిప్‌ ట్రావెలర్స్… కామెడీతో పాటు మైండ్ బెండయ్యే ట్విస్టులు

కలల ప్రపంచంలో చిక్కుకుయే స్పేస్‌షిప్‌ ట్రావెలర్స్… కామెడీతో పాటు మైండ్ బెండయ్యే ట్విస్టులు
Advertisement

Chinese Action Adventure: కలల ప్రపంచంలో చిక్కుకుపోతే ఎలా ఉంటుంది ? ఇదంటే భ్రమ అనుకుంటాం. కానీ అదే సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఇలాంటి సీన్స్ ఉంటే ఎలా ఉంటుంది. స్పేస్‌షిప్‌ ట్రావెలర్స్ ఇలాంటి సమస్యలో చిక్కుకుంటే అందులో నుంచి ఎలా బయట పడతారు ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ‘పర్ ఆస్పెరా యాడ్ అస్ట్రా’ (Per Aspera Ad Astra 2026) అనే టైటిల్ తో రూపొందిన చైనీస్ మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా లేదా ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కలల ప్రపంచంలో చిక్కుకుపోయిన అంతరిక్ష ప్రయాణికుల ఉత్కంఠభరిత రెస్క్యూ మిషన్ ఈ మూవీ. ఇక స్టోరీలోకి వెళ్తే… సమీప భవిష్యత్తులో మానవాళి సుదూర అంతరిక్ష ప్రయాణాలు చేస్తుంది. దీర్ఘకాలిక స్పేస్ ట్రావెల్ సమయంలో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు “స్వీట్ డ్రీమ్స్ LM” అనే అధునాతన వర్చువల్ రియాలిటీ డ్రీమ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. ఈ సిస్టమ్ ద్వారా ప్రయాణికులు తమకు కావాల్సిన ఏ కలల ప్రపంచాన్నైనా సృష్టించుకుని, అందులో తమ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. కానీ ఈ భారీ అంతరిక్ష నౌక ఉల్కల తుఫాను గుండా వెళ్తున్నప్పుడు, ఆ డ్రీమ్ సిస్టమ్‌లో తీవ్రమైన లోపం ఏర్పడుతుంది.

Advertisement

ఫలితంగా ప్రయాణికులందరూ తాము సృష్టించుకున్న కలల ప్రపంచాల్లోనే చిక్కుకుపోతారు. బయటకు రావడం అసాధ్యం అవుతుంది. ఒక్కొక్కరి కలలో ఒక్కొక్క భయంకరమైన ప్రపంచం… గ్యాంగ్‌స్టర్ సిటీలు, యుద్ధ భూములు, దేవుళ్లు, రాక్షసులు… అన్నీ నిజంగా మారిపోతాయి. ఈ సమస్యను గ్రహించిన మొదటి వ్యక్తి ఆ నౌకలోని టెక్నీషియన్ జు తియాన్‌బియావో (డైలాన్ వాంగ్). అతను తన స్కిల్స్ ను ఉపయోగించి కెప్టెన్ లీ సిమెంగ్ (విక్టోరియా సాంగ్)ను మేల్కొల్పుతాడు.

ఇద్దరూ కలిసి నౌకను రీస్టార్ట్ చేయడానికి అవసరమైన కీ కోడ్‌ను సేకరించాలి. అలా జరగాలంటే, వేర్వేరు ప్రయాణికుల కలల్లోకి ప్రవేశించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో విలన్ సృష్టించిన భయంకరమైన కలల ప్రపంచాలను దాటాల్సి ఉంటుంది. ఆ విలన్ తన కలల లోపల తానే దేవుడిగా మారి, మొత్తం నౌకను తన నియంత్రణలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. జు తియాన్‌బియావో, లీ సిమెంగ్ ఇద్దరూ కలిసి యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సంఘర్షణల మధ్య పోరాడుతూ ముందుకు సాగుతారు.

Advertisement

ప్రతి కలలో ఒక కొత్త ట్విస్ట్, ఒక కొత్త భయం వారిని వెంటాడుతుంది. కలలు నిజంగా మారిపోతుంటాయి. ఎవరు నిజం, ఎవరు భ్రమ అని తెలియని స్థితి ఏర్పడుతుంది. చివరికి ఈ ఇద్దరు హీరోలు తమ సాహసంతో నౌకలోని వేలాది మంది ప్రయాణికులను ప్రాణాలతో ఎలా కాపాడారు? అనేదే ఈ సినిమా స్టోరీ.

అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, సైబర్ పంక్ డిజైన్, హై-ఆక్టన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, కట్టిపడేసే ఎమోషనల్ లేయర్స్‌తో సాగే ఈ చిత్రం ఇన్‌సెప్షన్, మ్యాట్రిక్స్ ఫ్యాన్స్‌ మిస్ అవ్వకుండా చూడాల్సిన హిడెన్ జెమ్. ‘పర్ ఆస్పెరా యాడ్ అస్ట్రా’ Netflixలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడవచ్చు. హాన్ యాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డైలాన్ వాంగ్, విక్టోరియా సాంగ్, వాంగ్ డుయో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా జూన్ 18 నుండి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: మనుషుల్ని పిశాచాలుగా మార్చే వైరస్… కొరియన్ అపోకలిప్టిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×