E-Paper
Advertisement

సీరియల్ హత్యల వెనుక అదృశ్య శక్తి… టెన్షన్, హార్రర్ పీక్స్ లో ఉండే సిరీస్

సీరియల్ హత్యల వెనుక అదృశ్య శక్తి… టెన్షన్, హార్రర్ పీక్స్ లో ఉండే సిరీస్
Advertisement

Horror Series OTT: ఇప్పటికే ఓటీటీలో ఎన్నో హర్రర్ సినిమాలు, సిరీసులు ఉన్నాయి. కానీ ఈ జానర్లో వచ్చే సినిమాలు ఎప్పటికప్పుడు కొత్తగానే తోస్తాయి. అందుకే ఓటీటీలో ఇలాంటి కంటెంట్ పడిందో, చూడకుండా వదలరు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు మనం డిస్కస్ చేసే మూవీ సజెషన్ కూడా ఈ జానర్లో వచ్చిందే. ఇందులో హర్రర్ తో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుందా ? అన్న టెన్షన్ కూడా పీక్స్ లో ఉంటుంది. ఈ సిరీస్ పేరు ‘Them’. ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ ఆంథాలజీ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం.

కథలోకి వెళ్తే…

సీజన్ 1: కోవెనెంట్ (Them: Covenant – 2021)

Advertisement

ఇది ఆంథాలజీ సిరీస్. అంటే ప్రతి సీజన్‌లో వేర్వేరు కథలు ఉంటాయి.
ఈ సిరీస్ కథ 1953వ సంవత్సరంలో నడుస్తుంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉండే నల్లజాతీయుల (Black) కుటుంబం చుట్టూ స్టోరీ సాగుతుంది. కేవలం తెల్లజాతీయులు మాత్రమే ఉండే లాస్ ఏంజిల్స్ లోని పరిసరాల్లోకి కొత్తగా షిఫ్ట్ అవుతారు వీళ్ళు. అక్కడ అడుగు పెట్టినప్పటి నుండి చుట్టుపక్కల ఉండే తెల్లజాతీయులు వారిని తీవ్రంగా వేధిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే నరకం చూపిస్తారు. ఇది చాలదన్నట్టు ఆ ఇంట్లో ఉండే దెయ్యాలు, దుష్టశక్తులు కూడా ఆ కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తాయి. మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు, కంటికి కనిపించని దెయ్యాల మధ్య ఆ కుటుంబం ఎలా బతికింది ? అనేదే మొదటి సీజన్ లో చూడాల్సిన కథ.

సీజన్ 2 : ది స్కేర్ (Them: The Scare – 2024)

Advertisement

ఈ సీజన్ కథ 1991లో లాస్ ఏంజిల్స్ నగరంలో సాగుతుంది. డాన్ రీవ్ అనే ఒక ఎల్‌ఏపీడీ (LAPD) హోమిసైడ్ లేడీ డిటెక్టివ్ దే ఇందులో ప్రధాన పాత్ర. అంటే హత్యల కేసులను దర్యాప్తు చేసే ఆఫీసర్ అన్నమాట. ఆమె ఒక అనాథ శరణాలయంలో ఉండే తల్లికి సంబంధించిన ఘోరమైన హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ హంతకుడిని పట్టుకోవడానికి డాన్ రీవ్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఒక భయంకరమైన దుష్టశక్తి ఆమెను, ఆమె కుటుంబాన్ని పట్టుకుని పీడిస్తుంది. ఆ కేసుకు, వీరి కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ సీజన్ స్టోరీ.

ఈ సిరీస్ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. ఇందులో విపరీతమైన హింస, జుగుప్సాకరమైన హారర్ సీన్లు, జాతి వివక్షకు సంబంధించిన ఇబ్బందికరమైన సన్నివేశాలు, పెద్దలు మాత్రమే చూడాల్సిన సీన్లు ఉంటాయని గుర్తు పెట్టుకోండి. కాగా, 2021 నుండి 2024 వరకు విడుదలైన దీని రెండు సీజన్లను ఒకేసారి చూస్తే ఇంకా బెటర్.

Read Also: బొమ్మను నిజమైన పిల్లాడిలా చూసుకునే పేరెంట్స్… వింత నర్స్ ఎంట్రీతో మతిపోగొట్టే క్లైమాక్స్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×