E-Paper
Advertisement

Children’s film on OTT: గుడ్డి తమ్ముడి కోసం 300 కిమీ నడక… పుట్టిన రోజున పట్టెడు ఆశతో… నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ

Children’s film on OTT:  గుడ్డి తమ్ముడి కోసం 300 కిమీ నడక… పుట్టిన రోజున పట్టెడు ఆశతో… నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ
Advertisement

Children’s film on OTT : సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసమే ఎక్కువగా చూస్తుంటారు. అయితే వీటితో పాటు సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా వస్తుంటాయి. ఈ సినిమాలు మాత్రం ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఇద్దరు చిన్న పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఒక రోడ్ ట్రిప్ లా ఈ కథ ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా నేషనల్ అవార్డ్ గెలిచిన మూవీ కూడా. మనసును మెలుపెట్టే ఈ సినిమా ను ఎక్కడ చూడొచ్చు ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే…

ఎక్కడ చూడచ్చు అంటే

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘ధనక్’ (Dhanak). మనీష్ ముంద్రా, నగేష్ కుకునూర్, ఎలాహే హిప్టూలా నిర్మించిన ఈ చిత్రంలో హేతల్ గదా, క్రిష్ ఛబ్రియా అనే చైల్డ్ ఆర్టిస్టులు నటించారు. ఈ చిత్రం 17 జూన్ 2016న ఇండియా వైడ్‌గా విడుదలై ప్రశంసలు పొందింది. ఇది 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ పిల్లల చిత్రం ట్రోఫీని అందుకుంది. 65వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమాకు ‘క్రిస్టల్ బేర్’ అవార్డుతో పాటు చిల్డ్రన్ జ్యూరీ నుండి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. సుమారు 106 నిమిషాల పాటు సాగే ఈ సినిమా మొత్తం రాజస్థాన్‌లోని జైపూర్, జైసల్మేర్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా youtube, netflix, prime videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో నివసించే పారి, ఆమె తమ్ముడు చోటు అనాథలు. పుట్టుకతోనే కంటిచూపు లేని చోటుకి, తన తొమ్మిదవ పుట్టినరోజు నాటికి చూపు వచ్చేలా చేస్తానని పారి మాట ఇస్తుంది. ఒకరోజు తన అభిమాన నటుడు షారుఖ్ ఖాన్ కంటి దానం గురించి పోస్టర్లలో ప్రచారం చేయడం చూసిన పారి, ఆయనను కలిస్తే తన తమ్ముడికి ఖచ్చితంగా సాయం చేస్తాడని నమ్ముతుంది. తన తమ్ముడికి చూపు తెప్పించాలనే బలమైన సంకల్పంతో, ఆ చిన్నారి తన తమ్ముడిని తీసుకుని ఎవరికీ చెప్పకుండా షారుఖ్ ఖాన్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి బయలుదేరుతుంది.

ఇక ఈ ప్రయాణంలో ఆ ఇద్దరు పిల్లలు ఎడారి మార్గంలో అనేక రకాల వ్యక్తులను కలుస్తారు. కొందరు వారికి సహాయం చేస్తే, మరికొందరు ఇబ్బందులకు గురిచేస్తారు. అయినా సరే, పారి తన తమ్ముడిపై ఉన్న ప్రేమతో, ధైర్యంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. చివరికి వీళ్ళు అనుకున్న చోటుకి వెళ్ళి షారుఖ్ ని కలుస్తారా ? చోటుకి కంటి చూపు వస్తుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : భయం పుట్టించే కిల్లర్ హత్యలు… ఉత్కంఠ రేపే ఇన్వెస్టిగేషన్ … చెమటలు పట్టిస్తున్న ఒక్కో ఎపిసోడ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×