E-Paper
Advertisement

OTT Movie : సీను సీనుకో హార్రర్ సీన్… సూర్యరశ్మి పడితే కాలిపోయే పాప

OTT Movie : సీను సీనుకో హార్రర్ సీన్… సూర్యరశ్మి పడితే కాలిపోయే పాప
Advertisement

OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలను, ఇప్పుడు ఓటీటీలో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాలు ఇప్పుడు మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా బాలీవుడ్ నుంచి వచ్చింది. ఇందులో ఒక బావిలో పిల్లల్ని నరబలి ఇస్తుంటారు. ఒక అమ్మాయి వల్ల అక్కడ పరిస్థితి పూర్తిగా మరిపోతుంది. ఈ సినిమా హారర్ సీన్స్ తో బాగానే ప్రేక్షకులను భయపెట్టింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

సాక్షి తన భర్త రాజ్‌బీర్, కూతురు ఇషానీతో కలసి ఒక గ్రామంలో నివసిస్తుంటుంది. అయితే ఆ గ్రామంలో పెళ్లి కాని పిల్లలను, ఒక బావిలో నరబలి ఇస్తుంటారు. ఈ క్రమంలో సాక్షి తన ఏడేళ్ల కూతురు ఇషానీని, నరబలి ఇచ్చే మనుషుల నుంచి కాపాడుకుంటుంది. అక్కడి నుండి తప్పించుకుని వేరే ఊరికి వెళ్ళిపోతుంది. ఏడు సంవత్సరాల తర్వాత, సాక్షితన కూతురు ఇషానీతో మళ్ళీ ఆగ్రామానికి తిరిగి వస్తుంది. ఇషానీకి సూర్యరశ్మి తగిలితే చనిపోయే ఒక అరుదైన శాపం ఉంటుంది. ఒక రాత్రి, గ్రామస్తులు ఇషానీని కిడ్నాప్ చేసి, ఆమెను భయంకరమైన చెరకు తోటలు ఉండే ప్రాంతంలోకి తీసుకెళతారు. ఇషానీని ఒక దుష్ట శక్తి ని ప్రసన్నం చేసుకోవడానికి బలి ఇవ్వాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు.

ఈ సంప్రదాయాన్ని నడిపించే ఒక శక్తివంతమైన మహిళ, సాక్షికి ప్రధాన శత్రువుగా ఉంటుంది. ఈ గ్రామంలోని కొన్ని భయంకరమైన రహస్యాలు దాగి ఉంటాయి. సాక్షి, తన స్నేహితుడైన పోలీసు అధికారి సమర్ సహాయంతో, తన కూతురును రక్షించడానికి ఆ గ్రామంలోకి తిరిగి వెళ్తుంది. ఆమె అక్కడ బాల్య వివాహాలు, స్త్రీలపై హింస వంటి దురాచారాలతో పోరాడుతుంది. చివరికి సాక్షి ఆ గ్రామంతో పోరాడి, తన కూతుర్ని కాపాడుకుంటుందా ? ఆ గ్రామంలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి ? ఇషానీకి ఉన్న శాపం తొలగిపోతుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : పోలీసులకు క్లూ ఇచ్చి మరీ దొంగతనం… ఈ మలయాళ హీస్ట్ థ్రిల్లర్ లో ట్విస్టులకు మతి పోవాల్సిందే

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఛోరీ 2’ (Chhorii 2). 2025 లో విడుదలైన ఈ సినిమా 2021లో వచ్చిన ‘ఛోరీ’ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఈ మూవీకి విశాల్ ఫూరియా దర్శకత్వం వహించారు. ఇందులో నుష్రత్ భరూచా, సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజనీ, సౌరభ్ గోయల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో 2025 ఏప్రిల్ 11 నుంచి అందుబాటులోఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×