E-Paper
Advertisement

బాబోయ్ దిమ్మతిరిగే యాక్షన్… బుల్లెట్టు దిగినా బిల్డింగ్ నుంచి దూకినా చావని వింత మనుషులు

బాబోయ్ దిమ్మతిరిగే యాక్షన్… బుల్లెట్టు దిగినా బిల్డింగ్ నుంచి దూకినా చావని వింత మనుషులు
Advertisement

Action Thriller : అమరత్వం కోసం ఇదేం అరాచకం మావా – పిచ్చెక్కించే ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ను చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా ? అయితే ఓటీటీలో దుమ్మురేపిన ఈ మూవీ మీ కోసమే. ‘ది ఓల్డ్ గార్డ్’ (The Old Guard) టైటిల్ తో రూపొందిన ఈ సినిమా శతాబ్దాలుగా అమరులై యుద్ధం చేస్తున్న లెజెండరీ యోధుల ఇంటెన్స్ యాక్షన్ సూపర్ హీరో స్టోరీ. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రం గ్రెగ్ రుక్కా కామిక్ బుక్ ఆధారంగా తెరకెక్కింది. చార్లిజ్ థెరాన్ ప్రధాన పాత్రలో తీవ్రమైన నటనతో సినిమాను మరచిపోలేని అనుభవంగా మార్చింది.

కథలోకి వెళ్తే…

చరిత్రలోని వివిధ యుద్ధాలు, విప్లవాలు, సంక్షోభాల మధ్య దాగి ఉండి, ప్రపంచాన్ని రక్షించే ఒక రహస్య బృందం ఉంటుంది. వీళ్ళు సాధారణ మనుషులు కాదు అమరులు. గాయాలు, బుల్లెట్లు, భయంకరమైన దెబ్బలు ఏవైనా క్షణాల్లో నయమైపోతాయి. వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. కానీ ఒకరోజు ఈ అమరత్వం హఠాత్తుగా మాయమవుతుందని వారికి తెలుస్తుంది. ఈ బృందానికి నాయకత్వం వహిస్తుంది ఆండీ (ఆండ్రోమాచి) చార్లిజ్ థెరాన్. ఆమెతో పాటు బుకర్, జో, నిక్కీలు కూడా ఉంటారు.

Advertisement

శతాబ్దాలుగా వీళ్ళంతా మానవాళి కోసం పోరాడుతూ వస్తారు.ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక ఆపరేషన్‌ లో నైల్ ఫ్రీమాన్ (కికీ లేన్) గొంతు కోస్తారు. కానీ మరుసటి రోజు పూర్తిగా నయమై లేస్తుంది ఆమె. ఈ అమ్మాయి కూడా తమలాంటి అమరవీరురాలని ఆండీ బృందానికి డ్రీమ్స్ ద్వారా తెలుస్తుంది. ఆండీ వెంటనే నైల్‌ ను కలుసుకుని బృందంలో చేర్చుకుంటుంది. ఇక్కడే ఒక ప్రమాదకరమైన కుట్ర బయట పడుతుంది.

ఒక మిషన్‌కు వెళ్తుండగా ఆండీ బృందం ఒక పెద్ద ట్రాప్‌ లో చిక్కుకుంటుంది. మాజీ CIA ఏజెంట్ కోప్లీ సహాయంతో స్టీవెన్ మెరిక్ అనే దురాశాపరుడైన ఫార్మాస్యూటికల్ CEO వారిని బంధించి తన సీక్రెట్ ల్యాబ్‌ కు తరలిస్తాడు. వీళ్ళ DNAని ఉపయోగించి అమరత్వం ఇచ్చే డ్రగ్‌ను తయారు చేసి బిలియన్లు సంపాదించాలనేది అతని టార్గెట్. ఈ క్రమంలో ఆండీకి తన శక్తులు కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. అక్కడితో ఆమె అమరత్వం ముగిసిపోయిందని అర్థమవుతుంది.

Advertisement

మరోవైపు బుకర్ బృందానికి ద్రోహం చేసినట్లు బయటపడుతుంది. శతాబ్దాల ఒంటరి జీవితం వల్ల వచ్చిన మానసిక వేదనను భరించలేక అతను మెరిక్‌ కు సహకరిస్తాడు. క్లైమాక్స్ కిరాక్ అన్పించేలా ఉంటుంది. చార్లిజ్ థెరాన్ ఇంటెన్స్ యాక్షన్, నైల్‌తో కలిసిన ఫైట్ సీక్వెన్స్‌లు సినిమాలో ఉత్తేజం నింపుతాయి. చివరికి మెరిక్‌ను ఈ బృందం ఏం చేసింది ? అతని నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయట పడడానికి ఏం చేశారు ?.బుకర్‌కు ఎలా బుద్ధి చెప్పారు ? సినిమా చివర్లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే మూవీని వీక్షించాల్సిందే. ‘ది ఓల్డ్ గార్డ్’ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది.

Read Also : ఇంటర్వ్యూను మధ్యలో ఆపేస్తే మర్డర్… మైండ్ బెండింగ్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×