E-Paper
Advertisement

Charitha Kamakshi OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Charitha Kamakshi OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Charitha Kamakshi OTT : ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది తెలుగు రొమాంటిక్ మూవీ ‘చరిత కామాక్షి’(Charitha Kamakshi). ఈ లో బడ్జెట్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలోకి వచ్చేందుకు దాదాపు 4 ఏళ్లు పట్టింది. ‘కలర్ ఫోటో’ సినిమాలో కీలక పాత్రలో నటించిన దివ్య శ్రీపాద, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా 2022లో థియేటర్లో రిలీజ్ కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్లకు వెళ్ళకుండా డై‌రెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. భార్యాభర్తల చుట్టూ తిరిగే ఈ కథలో రొమాంటిక్ సీన్స్ తో పాటు, ఎమోషన్స్, షాకింగ్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. భారీ ఫైట్లు, డ్యాన్సులు కాకుండా.. కేవలం ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

నటి దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలో నటించిన ‘చరిత కామాక్షి’ (Charitha Kamakshi)లో ఆమెకు జోడీగా అభయ్ నవీన్ నటించారు. శ్రీలంక చందు సాయి ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. 2026 మార్చి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ​ఈ సినిమాలో బబ్లూ పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి, సతీష్ సారిపల్లి, అంజి మామ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ​ఈ సినిమాకు అబు సంగీతాన్ని అందించగా, రజినీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చరిత (దివ్య శ్రీపాద), చక్రి (అభయ్ నవీన్) ఇద్దరూ కొత్తగా పెళ్లయిన ఒక జంట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి, చిన్న చిన్న సంతోషాలు, అప్పుడప్పుడు వచ్చే గొడవలతో వాళ్ల లైఫ్ సరదాగా సాగిపోతుంటుంది. అయితే ఇద్దరకి ఆ ముచ్చట తీరాడానికి కొంచెం టైమ్ తీడుకుంటే మంచిదని అనుకుంటారు. వాళ్ల లైఫ్ అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న టైంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే చక్రి ఓ కేసులో ఇరుక్కుని కటకటాలపాలవుతాడు. చక్రిని బయట వదిలిపెట్టడానికి ఒక కండిషన్ పెడతాడు ఇన్స్పెక్టర్. ఆ కండిషన్ విని చరితకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ కండిషన్ ఏమిటి ? చరిత దానికి ఒప్పుకుంటుందా ? చక్రి చేసిన తప్పు ఏమిటి ? అతను జైలు నుంచి బయటకు వస్తాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకొనాల్సిందే.

Read Also : 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×