E-Paper
Advertisement

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు
Advertisement

Suspense Thriller: నమ్మకాలు కాస్తా మూఢనమ్మకాలుగా మారితే జరగకూడని దారుణాలన్నీ జరుగుతాయి. ముఖ్యంగా దేవుళ్ళకి బలివ్వడం అన్నది అనాదిగా ఆరాచారంగా వస్తోంది. ఏ మేకనో, కోడినో బలిస్తే పర్లేదు. కానీ అది మనిషిని బలిచ్చేదాకా వస్తేనే కథ అడ్డం తిరుగుతుంది. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. ‘చారక్: ఫెయిర్ ఆఫ్ ఫెయిత్’ (Charak: Fair of Faith 2026) అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ‘చారక్ మేళా’ అనే సాంప్రదాయ ఉత్సవం చుట్టూ తిరుగుతుంది. ఈ పండుగలో దేవుడిపై భక్తిని నిరూపించుకోవడానికి ప్రజలు తమ శరీరాలను కఠినమైన శారీరక శ్రమకు, హింసకు గురి చేసుకుంటారు. అంటే దేవుడి అనుగ్రహం కోసం శరీరంలోకి కొక్కెలు గుచ్చుకోవడం వంటి ఆచారాలు చేస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరడానికి ఇదే ఆఖరి అవకాశం అని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు.

Advertisement

అయితే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత ఆశలు, బాధల వల్ల ఈ కఠినమైన ఆచారంలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. ఉత్సవాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న సమయంలో, కథ ఒక్కసారిగా ఊహించని కోణంలోకి మళ్లుతుంది. గ్రామంలో పిల్లలు మిస్ అవుతారు. ఎవరో వాళ్ళను కిడ్నాప్ చేశారని, అక్కడ కొన్ని క్షుద్రపూజలు జరుగుతున్నాయనే చేదు నిజాలు బయటకు వస్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు.

ఇన్వెస్టిగేషన్ లో ఇద్దరు అబ్బాయిలు మిస్ అయ్యారని తేలుతుంది. అందులో ఒక అబ్బాయి చెరువులో శవమై తేలుతాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు ? మిస్సైన అబ్బాయిలను ఎవరు కిడ్నాప్ చేశారు ? ఆ ఊర్లో క్షుద్ర పూజలు చేస్తున్నది ఎవరు ? చివరికి కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

ఇండియన్ జానపద కథలలాగా ఉండే సోషల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిరాక్”. నమ్మకం పేరుతో జరిగే అంధవిశ్వాసాలు, పండుగ, భక్తి వెనుక దాగి ఉన్న క్రూరత్వం ఈ సినిమాలో చూస్తే వణుకు పుడుతుంది. సాంప్రదాయ ఉత్సవం ద్వారా సమాజంలోని లోపాలను, అంధవిశ్వాసాలను ఎండగట్టే అద్భుతమైన చిత్రమిది. 2026 మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుదీప్తో సేన్ నిర్మించారు. నమ్మకాల పేరుతో అమాయక ప్రజల జీవితాలను, అస్తిత్వాన్ని కొందరు ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఈ సినిమాను చూస్తే అర్థం అవుతుంది.. భక్తి అనేది మనుషులకు శక్తీని ఇస్తుందా ? లేక బలి కోరుతుందా ? అనే ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఈ సినిమా ఇంకా ఓటీటీలో అందుబాటులో లేదు. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

Read Also: మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×