E-Paper
Advertisement

OTT Movie : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

OTT Movie : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే
Advertisement

OTT Movie : బెంగాలీ నుంచి వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఒక కార్టూనిస్ట్ జీవితంలో జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దెయ్యాల కథలను ఇష్టపడేవాళ్ళు ఈ సిరీస్ ని కళ్ళు మూసుకోకుండా హ్యాపీగా చూడవచ్చు. ఎందుకంటే ఈ సిరీస్ లో అంతగా భయపెట్టే సన్నివేశాలు లేకపోయినా, కథ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలనుతెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘కార్టూన్ ‘ (Cartoon) బెంగాలీ భాషలో విడుదలైన ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. సౌరవ్ చక్రవర్తి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మైనక్ బెనర్జీ (అరిత్రా), పాయెల్ సర్కార్ (జినియా), సందీప్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ 2017 సెప్టెంబర్ 26న హోయ్‌చోయ్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలై, 7 ఎపిసోడ్‌లతో IMDbలో 6.0/10 రేటింగ్ సాధించింది.

కథలోకి వెళ్తే

Advertisement

అరిత్ర అనే వ్యక్తి ఒక కార్టూనిస్ట్, తన ప్రియురాలు జినియాతో కలిసి ఒక కొత్త అపార్ట్‌మెంట్‌లోకి మారతాడు. కానీ ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన తర్వాత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. అరిత్ర డ్రాయింగ్‌ వేసిన కార్టూన్‌లు వాటంతట అవే వేరే రూపంలోకి మారిపోతాయి. అతను పంపిన డ్రాయింగ్‌లకు బదులుగా ఖాళీ కాగితాలు అతని బాస్‌కు చేరతాయి. ఈ ఘటనలు అరిత్రను గందరగోళంలో పడేస్తాయి. అరిత్ర ఈ వింతలు హాలూసినేషన్స్ అని మొదట అనుకుంటాడు. కానీ జినియా సలహాతో అతను ఒక పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన రతికాంతబాబును సంప్రదిస్తాడు. రతికాంతబాబు ఆ అపార్ట్‌మెంట్‌లో ఒక ఆత్మ ఉందని అనుమానిస్తాడు. జినియాకు వీలైనంత త్వరగా ఆ స్థలాన్ని వదిలేయమని చెబుతాడు. కానీ పరిస్థితులు మరింత దిగజారతాయి.

ఈ సమయంలో రతికాంత బాబు అరిత్ర ఇంట్లో హఠాత్తుగా మరణిస్తాడు. ఈ మరణంతో అరిత్ర ప్రధాన అనుమానితుడిగా మారతాడు. కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. అరిత్ర ఈ రహస్యాల వెనుక ఉన్న నిజాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఆత్మలు, వాటి వెనుక ఉన్న గతం, అరిత్ర జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కథని ఉత్కంఠంగా మారుస్తుంది. ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ అపార్ట్‌మెంట్‌లో భయంకరమైన సంఘటనల వెనుక ఉన్న నిజం ఏమిటి? అరిత్రా, జినియా ఈ అతీంద్రియ శక్తుల నుంచి బయటపడగలరా? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×