E-Paper
Advertisement

OTT Movie : ఒకడికి తెలీకుండా మరొకరితో రిలేషన్… బాయ్ ఫ్రెండ్ మర్డర్ తో మిస్టరీ ట్విస్ట్… ట్విస్టులే ట్విస్టులు

OTT Movie : ఒకడికి తెలీకుండా మరొకరితో రిలేషన్… బాయ్ ఫ్రెండ్ మర్డర్ తో మిస్టరీ ట్విస్ట్… ట్విస్టులే ట్విస్టులు
Advertisement

OTT Movie : రియల్ కేస్ బేస్డ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ ని సెట్ చేస్తున్నాయి. ఆడియన్స్ కూడా మొదట వీటినే చూడటానికి ఇష్టపడుతున్నారు. అయితే వీటిలో కొన్ని సిరీస్ లలో రొమాంటిక్ కంటెంట్ హద్దులు దాటేస్తుంటుంది. క్రైమ్ తో పాటు మసాలా కూడా దంచికొడుతుంటాయి. అలాంటి రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో మంచి వ్యూస్ తో స్ట్రీమింగ్ అవుతోంది. స్పెయిన్‌లో సంచలనం సృష్టించిన ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ మర్డర్ కేసుతో ఈ కథ మెంటలెక్కిస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ మిని సిరీస్ పేరు ‘బర్నింగ్ బాడీ’. దీనికి జార్జ్ టోరెగ్రోస్సా, లారా మానా దర్శకత్వం వహించారు. ఇందులో ఉర్సులా కార్బెరో, క్విమ్ గుటిరెజ్, జోస్ మాన్యువల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2023 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎనిమిది ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ ఐయండిబిలో 6.7/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బార్సిలోనా సమీపంలో రిజర్వాయర్‌లో ఒక కాలిపోయి ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. కారు ట్రంక్‌లో పెడ్రో అనే ఒక పోలీస్ ఆఫీసర్ బర్న్ అయిన బాడీ దొరుకుతుంది. ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. సస్పెక్ట్స్ గా పెడ్రో గర్ల్‌ ఫ్రెండ్ రోసా పెరాల్, ఆమె లవర్ ఆల్బర్ట్ ఉంటారు. రోసా కూడా అదే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్. ఫ్లాష్‌ బ్యాక్‌లలో రోసా, పెడ్రో రిలేషన్ చూపిస్తారు. రోసాని పెడ్రో లవ్ చేస్తాడు కానీ రోసా అతన్ని యూజ్ చేసుకుని, ఆల్బర్ట్‌తో సీక్రెట్ అఫైర్ పెట్టుకుంటుంది. రోసా హస్బెండ్ నుంచి డివోర్స్ తీసుకుని పెడ్రోతో ఉంటుంది కానీ ఆల్బర్ట్‌తో రిలేషన్ కంటిన్యూ చేస్తుంది. ఆల్బర్ట్ రోసాని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఆమె ప్రైవేట్ వీడియోస్ అతని దగ్గర ఉండటంతో ఏం చేయలేక అతనితో కూడా రిలేషన్ పెట్టుకుంటుంది.

Read Also : సంచులు సంచులుగా దొరికే డబ్బులు… మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు… ఓటీటీలో అదరగొట్టబోతున్న హీస్ట్ థ్రిల్లర్

Advertisement

ఇప్పుడు రోసా తన ఇమేజ్ కాపాడుకోవడానికి మీడియా ముందు ఇన్నోసెంట్‌గా యాక్ట్ చేస్తుంది. కానీ ఆమె లైఫ్‌లో టాక్సిక్ రిలేషన్స్, సెక్సువల్ స్కాండల్స్ బయటపడతాయి. ఆల్బర్ట్ రోసాని ప్రేమిస్తాడు కానీ ఆమెని కంట్రోల్ చేయడానికి బ్లాక్‌మెయిల్ యూజ్ చేస్తాడు. ఇప్పుడు పెడ్రో మర్డర్ ప్లాన్ రివీల్ అవుతుంది. రోసా, ఆల్బర్ట్ కలిసి పెడ్రోని చంపి కారులో బర్న్ చేశారు. మీడియా ట్రయల్ భారీగా జరుగుతుంది. కోర్ట్ ట్రయల్‌లో రోసా తనని ఇన్నోసెంట్‌గా చూపించుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె ప్రయత్నం ఫలిస్తుందా ? ఈ హత్య నుంచి వీళ్ళు తప్పించు కుంటారా ? జైలుకు వెళ్తారా ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×