E-Paper
Advertisement

OTT Movie : వీడెవడ్రా బాబూ… పరమానందయ్య శిష్యుడికి బాబులా ఉన్నాడు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : వీడెవడ్రా బాబూ… పరమానందయ్య శిష్యుడికి బాబులా ఉన్నాడు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సినిమాలు, హ్యాపీగా కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీస్ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇలాంటి సినిమాలతో రెండు గంటల పాటు టెన్షన్స్ మరిచి, సరదాగా నవ్వుకోవచ్చు. అలా అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. జయం రవి నటించిన ఈ కామెడీ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం పదండి.

జీ5లో స్ట్రీమింగ్
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీలో తమిళ స్టార్ జయం రవి హీరోగా నటించాడు. ఈ మూవీ పేరు ‘బ్రదర్’ (Brother). 2024 అక్టోబర్ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, అదే ఏడాది నవంబర్ 29 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి ఎమ్. రాజేష్ దర్శకత్వం వహించగా, ప్రియాంకా మోహన్, భూమికా చావ్లా, నటరాజన్ సుబ్రమణియం, రావు రమేష్, సారన్య పొన్వన్నన్, VTV గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

కథలోకి వెళ్తే…
కార్తీక్ (జయం రవి) అనే అబ్బాయి ఒక లా స్టూడెంట్. కానీ చదువు పూర్తి చేయకుండా, అత్యుత్సాహం, ఆలోచన లేని పనులతో ఏరికోరి ఇబ్బందులను కొని తెచ్చుకుంటాడు. చెన్నైలో తన తల్లిదండ్రులైన కుమారస్వామి, సరస్వతి దగ్గరే నివసించే కార్తీక్, స్థానిక అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌ ను సంప్రదించకుండా ఒక డెమొలిషన్ ఆర్డర్ తెప్పించి తన కుటుంబానికి సమస్యలు సృష్టిస్తాడు. అతను చేసే పరమానందయ్య శిష్యుడి చేష్టలు చూసి విసిగిపోయిన తల్లిదండ్రులు, ఊటీలో ఉండే తన అక్క ఆనంది (భూమికా చావ్లా) ఇంటికి పంపిస్తారు. ఆమె అయినా అతన్ని చక్కదిద్దుతుందేమో అనే ఆశతో.

Read Also : ఈ ఫ్యామిలీలో మగ వాళ్ళకీ మాత్రమే ఆ సూపర్ పవర్… జబర్దస్త్ ట్విస్టులున్న టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ

Advertisement

ఆనంది, ఆమె భర్త అరవింద్ (నటరాజన్ సుబ్రమణియం), అరవింద్ తల్లిదండ్రులైన శివగురునాథన్ (రావు రమేష్), హేమమాలినితో కలిసి ఊటీలో ఉంటుంది. శివగురునాథన్ ఒక అహంకార కలెక్టర్. ఇంట్లో కఠినమైన రూల్స్ పెడతాడు. కానీ ఈ తలతిక్క కార్తీక్ చేసే పిచ్చి పనులతో ఇక్కడ కూడా సమస్యలు మొదలవుతాయి. ఫ్యామిలీ డిన్నర్‌ను నాశనం చేస్తాడు, హాస్పిటల్ బౌన్సర్‌గా, PT ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగాలు చేయలేకపోతాడు. శివగురునాథన్‌తో కార్తీక్ కు జరిగే వాదన… ఆనంది, అరవింద్ కుటుంబాల మధ్య విభేదాలకు కారణమవుతుంది. ఈ సంఘటన తర్వాత కార్తీక్ కు తన తండ్రి చీవాట్లు పెడతాడు. అంతేకాదు కోపంలో అతన్ని దత్తత తీసుకున్నామని చెప్పడం కార్తీక్ మనసును గాయపరుస్తుంది. ఆ తరువాత కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? ఇప్పటికైనా అతనిలో మార్పు వస్తుందా? అర్చనా ఎవరు? చివరికి ఫ్యామిలీ అతన్ని చేరదీస్తుందా ? లేదా ? అనేది తెరపై చూడాల్సిందే. ఇందులో కామెడీతో పాటు భావోద్వేగ అంశాలు కూడా ఉంటాయి. పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ టైమ్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×