E-Paper
Advertisement

OTT Movie : కూతురి కోసం చేతబడి చేసే తల్లి… దెయ్యాలకే వణుకు పుట్టించే స్టోరీ భయ్యా ఇది

OTT Movie : కూతురి కోసం చేతబడి చేసే తల్లి… దెయ్యాలకే వణుకు పుట్టించే స్టోరీ భయ్యా ఇది
Advertisement

OTT Movie : హారర్ జానర్ ని ఇప్పుడు అందరూ ఆస్వాదిస్తున్నారు. ఎక్కువగా ఈ సినిమాలను ఓటీటీలో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలు ఇంటి దగ్గర రాత్రి పూట లైట్స్ ఆఫ్ చేసి చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. అలాంటి కిక్ ఇచ్చే స్టోరీ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ తండ్రి మరణం తర్వాత ఇద్దరు పిల్లల ఒక మహిళ సంరక్షణలోకి వెళతారు. అయితే అక్కడ బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్ లో చిక్కుకుపోతారు. అక్కడి నుంచి వీళ్ళు ఎలా బయట పడతారనేదే ఈ స్టోరీ. ఈ సినిమా చాలా భయంకరంగా ఉంటుంది. హారర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో విడుదలైన ఈ ఆస్ట్రేలియన్ సూపర్‌న్యాచురల్ హారర్ సినిమా పేరు ‘బ్రింగ్ హెర్ బ్యాక్’ (Bring Her Back). డాన్నీ ఫిలిప్పౌ & మైఖేల్ ఫిలిప్పౌ (టాక్ టు మీ ఫేమ్ డైరెక్టర్స్) దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సాలీ హాకిన్స్ (లారా), బిల్లీ బారెట్ (ఆండీ), సోరా వాంగ్ (పైపర్) లీడ్ రోల్స్ లో నటించారు. 1 గంట 39 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.8/10 రేటింగ్ పొందింది. 2025 మే 29న థియేట్రికల్ రిలీజ్అయిన ఈ సినిమా, ప్రస్తుతం ఫ్యాక్టరీ TV, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : కట్టుకున్నోడిని కాటికి పంపే భార్య… ప్రెగ్నెన్సీ కోసం ప్రియుడితో… దిమ్మతిరిగే క్లైమాక్స్

స్టోరీ ఏమిటంటే

ఆండీ, అతని చెల్లెలు పైపర్ తమ తండ్రి మరణం తర్వాత అనాథలవుతారు. ఆండీకి ఇంకా సంరక్షకుడిగా మారడానికి వయస్సు రాకపోవడంతో, వారిద్దరినీ ఒకే ఫాస్టర్ హోమ్‌లో ఉంచుతారు. వాళ్ళు లారా అనే మహిళ ఇంటికి వెళ్తారు. అక్కడి వెళ్ళాక ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. లారా మీద, ఆమె ఇంటి వాతావరణంపై ఆండీకి అనుమానం కలుగుతుంది. తన చెల్లెలు ప్రమాదంలో ఉందని గ్రహించిన ఆండీ, ఆమెను ఆ ఇంట్లో ఉన్న భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వారు అతీంద్రియ శక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లారా తన చచ్చిపోయిన కూతురు కథీ బాడీని ఫ్రీజర్‌లో దాచి ఉంచింది. లారా ఒక డార్క్ రిచువల్ చేసి కథీని తిరిగి బతికించుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఆ రిచువల్‌లో పైపర్ బాడీని యూజ్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆండీ తన చెల్లెలును ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ.

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×