E-Paper
Advertisement

OTT Movie : తాగుబోతు భర్త… వయసులో ఉన్న పెళ్ళాం… వీళ్ళు చేసే పనులకు దిమ్మతిరగాల్సిందే

OTT Movie : తాగుబోతు భర్త… వయసులో ఉన్న పెళ్ళాం… వీళ్ళు చేసే పనులకు దిమ్మతిరగాల్సిందే
Advertisement

OTT Movie : మద్యానికి అలవాటు పడిన భర్తల వల్ల ఎన్నో కుటుంబాలు చల్లా చెదురు అయిపోయాయి. ఈ మహమ్మారి వల్ల నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీని గురించి చెప్పాలంటే మాటలు కూడా చాలవు. ఈ మహమ్మారి ఎందరో ఆడవాళ్ళ ఉసురు పోసుకుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మద్యం వల్ల ఒక కుటుంబం ఎలాంటి సమస్యలు ఫేస్ చేసిందో చెప్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

ఆహా (aha) లో

Advertisement

ఈ మూవీ పేరు ‘బాటిల్ రాధ’ (Bottle Radha). 2025లో విడుదలైనఈ కామిడీ ఎంటర్టైనర్ మూవీకి దినకరన్ శివలింగం రచించి, దర్శకత్వం వహించారు. బెలూన్ పిక్చర్స్, TN అరుణ్‌బాలాజీతో కలిసి నీలం ప్రొడక్షన్స్‌ పై  రంజిత్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీని తమిళం, మలయాళం భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇందులో గురు సోమసుందరం, సంచనా నటరాజన్ ప్రధాన పాత్రలు పోషించగా, జాన్ విజయ్ , లొల్లు సభ మారన్ , మెర్కు తొడార్చి మలై ఆంటోని, పరి ఎలవళగన్, అన్బరసి సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

రాధాకృష్ణ ఎప్పుడూ మందు తాగుతూనే ఉంటాడు. టైల్స్ వర్క్ చేస్తూ తన భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు. పనికి వెళ్లేటప్పుడు కూడా మందు తాగే వెళతాడు. అయితే వచ్చే సంపాదన రాధాకృష్ణ తాగుడుకే సరిపోతుంది. తాగి ఊరుకోకుండా, అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అయితే తాగితేనే ఈ విన్యాసాలు చేస్తుంటాడు రాధాకృష్ణ. మత్తు దిగినాక భార్య పిల్లలతో మంచిగానే ఉంటాడు. భార్య వసుంధర కూడా ఈ విషయం మీద ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనుకుంటూ దిగులు పడుతుంది. పని ఇచ్చిన మేస్త్రీ తో కూడా గొడవ పెట్టుకుంటాడు రాధాకృష్ణ.  అయితే ఒకరోజు ఇతనికి పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది. ఆ విషయం తెలిసి మందు తాగి పనికి వెళ్తాడు. రాధాకృష్ణ ను తీసుకు వెళ్లిన వాళ్ళు ఒక చీకటి గదిలో బంధిస్తారు. నిజానికి అక్కడ చాలామంది తాగుబోతులు ఉంటారు. ఆల్కహాల్ కి బానిస అయిన వాళ్లను అక్కడ ఉంచుతారు. వసుంధర కొంతమంది అధికారుల దగ్గర మొర పెట్టుకోవడంతో, అతన్ని వాళ్ళు పని ఉందని చెప్పి  తీసుకెళ్తారు. అయితే అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు రాధాకృష్ణ. మళ్లీ మందు తాగడం మొదలు పెడతాడు. రాధాకృష్ణతో వసుంధర విసిగిపోయి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంతలో మద్యం తాగుతున్నప్పుడు తన స్నేహితుడు రక్తం కక్కుకొని చనిపోతాడు. అప్పుడు రాధాకృష్ణకి భయం మొదలవుతుంది. చివరికి రాధాకృష్ణ మద్యం మానేస్తాడు? భార్య పిల్లలతో కలసి ఉంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాటిల్ రాధ’ (Bottle Radha) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×