// // అడవిలోకి అమ్మాయిని రప్పించే పిశాచి... కట్ చేస్తే కలవరపెట్టే -->
E-Paper
Advertisement

అడవిలోకి అమ్మాయిని రప్పించే పిశాచి… కట్ చేస్తే కలవరపెట్టే క్లైమాక్స్

అడవిలోకి అమ్మాయిని రప్పించే పిశాచి… కట్ చేస్తే కలవరపెట్టే క్లైమాక్స్
Advertisement

Horror Thriller : 2025లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFR)లో ప్రీమియర్ అయి, 2026లో థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ ఫాంటసీ ఫోక్-హారర్ థ్రిల్లర్ ‘బోక్షి’ (Bokshi). దర్శకుడు భార్గవ్ సైకియా సిక్కింలోని దట్టమైన హిమాలయ అడవులు, స్థానిక జానపద కథలు, మూఢనమ్మకాలు, స్త్రీ శక్తి వంటి అంశాలను కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రసన్న బిష్త్, మానసి ముల్తానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కేవలం దయ్యాల కథ కాదు. సమాజంలోని పితృస్వామ్యం, స్త్రీ ఆవేశం, ప్రకృతి రహస్యాలను లోతుగా తాకే చిత్రం. మరి ఈ హర్రర్ మూవీ స్టోరీ ఏంటి ? కథ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

17 ఏళ్ల అనాహిత (ప్రసన్న బిష్త్) బాల్యం షాకింగ్ గా ఉంటుంది. చిన్నతనంలో తన కళ్ల ముందే తల్లి అకస్మాత్తుగా అదృశ్యమైన ఘోర గతం వల్ల తీవ్రమైన మానసిక వేదన (PTSD)తో ఆమె బాధ పడుతుంటుంది. ప్రతి రోజూ రాత్రి కలలు, భయాలు ఆమెను వెంటాడుతుంటాయి. స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులు ఎక్కువ కావడంతో, ఆమె నానమ్మ ఆమెను ఒక బోర్డింగ్ స్కూల్‌ కు పంపిస్తుంది. కొత్త స్కూల్లో హిస్టరీ టీచర్ షాలిని (మానసి ముల్తానీ)తో అనాహితకు మంచి స్నేహం ఏర్పడుతుంది. షాలిని చెప్పే స్థానిక జానపద కథలు, మంత్రగత్తెల గాథలు అనాహిత తల్లి నమ్మకాలతో పోలి ఉండటం ఆమెను ఆకర్షిస్తుంది.

Advertisement

ఒక ఎక్సకర్షన్‌లో షాలిని కొంతమంది విద్యార్థులను దట్టమైన హిమాలయ అడవిలోకి తీసుకెళ్తుంది. తన తల్లి అదృశ్యం వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశతో అనాహిత కూడా వారితో వెళ్తుంది. అడవిలోకి ప్రవేశించిన తర్వాత స్థానికులు అక్కడికి వెళ్లొద్దని హెచ్చరిస్తారు. కానీ షాలిని శాపగ్రస్తమైన ప్రాంతంలోకి తన టీంను తీసుకెళ్తుంది. అక్కడ ‘బోక్షి’ అనే పురాతన అజ్ఞాత శక్తి, గిరిజన సంస్కృతి రహస్యాలు, భయంకరమైన సంఘటనలు ఆ బృందాన్ని భయపెడతాయి. అనాహిత తన తల్లి అదృశ్యం వెనుక ఉన్న నిజాన్ని, తన విధిని ఎలా ఎదుర్కొంటుంది ? అనేది సినిమా క్లైమాక్స్. మరి ఆ అదృశ్య శక్తి ఎవరు ? ఆమె తల్లి ఎలా మిస్ అయ్యింది ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అన్నది స్టోరీ.

ఎందుకు చూడాలి?

‘బోక్షి’ కేవలం హారర్ సినిమా కాదు. హిమాలయ అడవుల అందం, భయానక వాతావరణం, బలమైన ట్విస్ట్‌లు, ఎమోషనల్ డెప్త్ ఉన్న స్పెషల్ మూవీ. ప్రసన్న బిష్త్ పాత్రలో అనాహితగా భయం, ధైర్యం, ఆవేశం అన్నీ ఎమోషన్స్ లో బాగా నటించింది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంది. MUBIలో ఈ సినిమాను చూడవచ్చు.

Advertisement

Read Also : పదేళ్లుగా ఒకే అద్దె కొంపలో… కట్ చేస్తే కన్నీళ్లు పెట్టించే ట్విస్ట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×