E-Paper
Advertisement

OTT Movie : కూతుర్ని కూడా వదలకుండా ముసలాడి అరాచకం … ఆమె ఫ్రెండ్ ని కూడా ప్రెగ్నెంట్ చేసి …

OTT Movie : కూతుర్ని కూడా వదలకుండా ముసలాడి అరాచకం … ఆమె ఫ్రెండ్ ని కూడా ప్రెగ్నెంట్ చేసి …
Advertisement

OTT Movie : ఓటిటిలో హాలీవుడ్ సినిమాల పాత్ర ఎక్కువగానే ఉంటుంది. అటు నుంచి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లను చూసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో యాక్షన్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా వీటినే సర్చ్  చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. స్టోరీస్ సింపుల్ గానే ఉన్నా, తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఎంటర్టైన్ ఇచ్చాడు దర్శకుడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లాక్ బ్యాగ్స్’ (Black Bags). 2023 లో వచ్చిన ఈ మూవీకి జోష్ బ్రాండన్ దర్శకత్వం వహించారు. ఇందులో లారా వెండర్, ఒలిసియా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా స్టోరీ ఇద్దరు స్త్రీలు టెస్, లారా ల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళుకు ఒకేలాంటి నల్లని ట్రావెల్ బ్యాగ్‌లు ఉండటటం వల్ల, ఊహించని పరిణామాలు ఎదురౌతాయి. ఆతరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

టెస్ అనే మహిళ గర్భవతిగా ఉంటుంది. తన ఆరోగ్య సమస్యల కోసం మందులు తీసుకుంటూ బస్సులో ప్రయాణిస్తుంది. ఆమె ప్రయాణించే బస్సులోనే తన పక్కన సారా అనే మహిళ కూర్చొంటుంది. ఆమె బ్యాగ్ కూడా టెస్ బ్యాగ్‌తో సమానంగా ఉంటుంది. బస్సు జర్నీ ముగిసిన తర్వాత, టెస్ తప్పుగా సారా బ్యాగ్‌ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఆ బ్యాగ్‌ని తెరిచినప్పుడు, లోపల షాకింగ్‌గా ఏదో ఒక వస్తువు కనిపిస్తుంది. అది సారాకి డేంజరస్ గా అనిపిస్తుంది. సారా, బ్యాగ్‌లు మారిన విషయం తెలుసుకుని టెస్ ఇంటికి వస్తుంది. అక్కడ నుండి, ఇద్దరి మధ్య ఒక అనుమానం మొదలవుతుంది. ఆ వస్తువు గురించి సారా చెప్పే వివరణలు నిజమా, లేక ఆమె ఏదో దాస్తున్నదా అనే సందేహం టెస్‌కి కలుగుతుంది. సారాకి తనగురించి ఏమైనా నిజాలు తెలిసాయా అని టెన్షన్ పడుతుంది. నిజానికి వీళ్ళిద్దరూ టెస్ తండ్రివల్ల నరకం చూసి ఉంటారు. ఇది క్లైమాక్స్ లో బయట పడుతుంది. చివరికి ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు, రహస్యాలు టెస్ బయటపెడుతుందా ? సారా బ్యాగ్ లో దొరికిన వస్తువు ఏమిటి ? ఇద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా చివరి భాగంలో ఊహించని ట్విస్ట్‌లతో ముగుస్తుంది. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, సారా, టెస్ ల నటన చాలా బాగుందని ప్రశంసలు కూడా వచ్చాయి.

Read Also : కలలో జరిగే హత్యలు నిజంగా జరిగితే … బార్ గర్ల్స్‌ నే టార్గెట్ చేసే సైకో … ట్విస్ట్ లతో అదరగొట్టే సైకలాజికల్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×