E-Paper
Advertisement

Biopic Movie OTT: అనంత సముద్రంలో అదిరిపోయే సాహసం… 16 ఏళ్ల అమ్మాయి ఏడు నెలలు ఒంటరిగా…

Biopic Movie OTT: అనంత సముద్రంలో అదిరిపోయే సాహసం… 16 ఏళ్ల అమ్మాయి ఏడు నెలలు ఒంటరిగా…
Advertisement

Biopic Movie OTT : రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఒక మూవీ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపింది. ఒంటరిగా 16 ఏళ్ల వయసులో సముద్రాన్ని చుట్టిన ఒక అమ్మాయి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా వాట్సన్ అనే అమ్మాయి, 2009లో చేసిన సాహస యాత్ర ఆధారంగా ఈ సినిమా తీశారు. జెస్సికా తన 16వ ఏట, 210 రోజుల పాటు ఒంటరిగా సముద్రంలో ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. 2010 మే 15న ఆమె సిడ్నీ హార్బర్‌కు చేరుకున్నప్పుడు వేలాది మంది ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. అయితే ప్రయాణం మొదలుపెట్టక ముందు ఆమెను చాలా మంది ఇది నువ్వు చెయ్యలేవు అని నిరుత్సాహపరిచారు. అయితే ఆమె చివరికి అందరి నోర్లు మూయించింది. ఆమె తిరిగి వచ్చాక అప్పటి ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కెవిన్ రడ్ ఆమెను ‘ఆస్ట్రేలియా కొత్త హీరో’ అని కొనియాడారు

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో

ఈ ఆస్ట్రేలియన్ బయోపికల్ డ్రామా సినిమా పేరు ‘ట్రూ స్పిరిట్’ (True Spirit). ఇది అత్యంత చిన్న వయసులో (16 ఏళ్లు) ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన జెస్సికా వాట్సన్ అనే అమ్మాయి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇందులో టెగన్ క్రాఫ్ట్ (జెస్సికాగా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జెస్సికా అనే పదహారేళ్ల పిల్లకు చిన్నప్పటి నుంచే సముద్రం అంటే పిచ్చి. లోకమంతా తలకిందులైనా సరే, ఒక్కతే పడవ వేసుకుని ప్రపంచం మొత్తం చుట్టి రావాలని ఫిక్స్ అయిపోద్ది. అంత చిన్న పిల్లవి నీవల్ల కాదు, సముద్రం అంటే ఆటలు కాదని అందరూ భయపెట్టినా, ఆ పిల్ల మాత్రం వెనక్కి తగ్గదు. తన పడవకి పింక్ రంగు వేసుకుని, ఇంట్లో వాళ్లని ఒప్పించి ఒంటరిగా ప్రయాణం మొదలుపెడుతుంది. ఇక సముద్రం మధ్యలోకి వెళ్ళాక అసలు సినిమా మొదలవుతుంది. ఆకాశమంత ఎత్తున లేచే రాకాసి అలలు, భయంకరమైన తుపాన్లు ఆ పడవను ఫుట్‌బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాయి.

కొన్నిసార్లు పడవ నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. పైగా నెలల తరబడి మనుషులు కనిపించక, మాట్లాడటానికి ఎవరూ లేక పిచ్చి పట్టినంత పని అవుతుంది. కానీ జెస్సికా మాత్రం మొండిగా ముందడుగు వేస్తుంది. చివరికి 210 రోజుల పాటు చావుతో పోరాడి, అన్ని అడ్డంకులను తొక్కుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకుంటుంది. తనని తక్కువ అంచనా వేసిన వాళ్లందరి నోళ్లు మూయించి, అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టేసిన వీరనారిగా రికార్డు సృష్టిస్తుంది.

Advertisement

Read Also : ఓటీటీలో దుమ్ము దులుపుతున్న కొరియన్ సిరీస్… 8 కి పైగా రేటింగ్ తో… మైండ్ బ్లాక్ చేసే ఒక్కో ఎపిసోడ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×