E-Paper
Advertisement

OTT Movie : మాఫియా డాన్ చుట్టూ తిరిగే స్టోరీ … కొంచెం రక్తపాతం, కొంచెం కామెడీ …పక్కా ఎంటర్టైనర్

OTT Movie : మాఫియా డాన్ చుట్టూ తిరిగే స్టోరీ … కొంచెం రక్తపాతం, కొంచెం కామెడీ …పక్కా ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : కామెడీ క్రైమ్ డ్రామాతో తెరకెక్కిన ఒక బాలీవుడ్ సిరీస్ టాప్ రేటింగ్ తో దుమ్ము లేపుతోంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ IMDBలో 8.5/10 రేటింగ్ ను పొందింది. ఇది క్రైమ్, రాజకీయాలు, కుటుంబ డైనమిక్స్‌ను కలుపుతూ, మరచిపోలేని ఒక వినోదాత్మక అనుభవాన్ని అందిస్తుంది. ఇది బిందియా అనే నగరంలో జరిగే ఒక అస్తవ్యస్తమైన మాఫియా కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మీరు కూడా వెంటనే ఈ సిరీస్ పై ఓ లుక్ వేయండి. తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …

ఏ ఓటీటీలో ఉందంటే

Advertisement

‘బిందియా కే బాహుబలి’ (Bindiya Ke Bahubali) ఒక హిందీ డార్క్ కామెడీ వెబ్ సిరీస్. ఈ సిరీస్ రాజ్ అమిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సౌరభ్ శుక్లా, రణవీర్ షోరే, సీమా బిస్వాస్, సాయి తమ్హంకర్, షీబా ఛద్దా, వినీత్ కుమార్, ఆకాష్ దహియా, సుశాంత్ సింగ్, తనిష్ఠా ఛటర్జీ, దిబ్యేందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2025 ఆగస్టు 8 నుంచి Amazon MX Player లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏంటంటే

Advertisement

ఈ కథ బిందియా నగరంలో అందరూ భయపడే, బడా దావన్ (సౌరభ్ శుక్లా) అనే మాఫియా డాన్‌తో మొదలవుతుంది. అతను తన రాజకీయ కెరీర్‌ను ప్రారంభించబోతున్న సమయంలో సూపర్‌కాప్ మురళీ మంజీ అతన్ని అరెస్ట్ చేస్తాడు. దీంతో దావన్ కుటుంబంలో అధికారం కోసం గందరగోళం ఏర్పడుతుంది. బడా దావన్ జైలులో ఉండగా, అతని కుమారుడు ఛోటే దావన్ (రణవీర్ షోరే) కుటుంబ వ్యాపారాన్ని, అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఛోటే అసమర్థత, ప్రత్యర్థి గ్యాంగ్‌ల దాడులు, దురాశతో కూడిన మామ, కుటుంబంలోని అంతర్గత డ్రామా అతని ప్రయత్నాలను సవాలు చేస్తాయి.

Read Also : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

ఈ మధ్యలో, 25 కోట్ల నగదు దాచిన సంచి కోసం అందరూ పోటీ పడతారు. ఇది కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. ఈ సిరీస్ ఒక వైపు హాస్యాస్పదమైన సన్నివేశాలతో నవ్విస్తూనే, మరోవైపు ద్రోహం, కుటుంబ విధేయత, అధికార ఆకాంక్షలను ఆసక్తికరంగా చూపిస్తుంది. బిందియా అనే నగరం ఈ కథలో ఒక సర్కస్‌లా మారుతుంది. ఇక్కడ ప్రేమ ఒక ఒప్పందంగా, అధికారం వ్యక్తిగతంగా, ప్రతి ఒక్కరి చేతుల్లో రక్తం చిందించే సంఘటనలు ఉంటాయి. సూపర్‌కాప్ మురళీ మంజీ నిఘా, బిందియా నది పక్కన ఉన్న భూమి కబ్జా, ఛోటే రాజకీయ ఆకాంక్షలు కథను ఒక డైనమిక్ పొలిటికల్ చెస్ గేమ్‌గా మారుస్తాయి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×