E-Paper
Advertisement

OTT Movie : పనోడికి అందమైన భార్య వస్తే… సంసారిని వేశ్యగా మార్చే ఊరి పెద్దలు

OTT Movie : పనోడికి అందమైన భార్య వస్తే… సంసారిని వేశ్యగా మార్చే ఊరి పెద్దలు
Advertisement

OTT Movie : ఇప్పుడు సినిమాలను థియేటర్లలో కంటే ఓటీటీ లోనే ఎక్కువగా చూస్తున్నారు. ఇందులో థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజులలోనే స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటితోపాటు వెబ్ సిరీస్ లు కూడా రావడంతో, ప్రేక్షకులు ఓటిటి ప్లాట్ ఫామ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మంచి మెసేజ్ ఇచ్చే కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటిటిలో మాత్రం దూసుకెళ్తూ ఉంటాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ మూవీ పేరు ‘భూరి‘ (Bhouri). 2016లో విడుదలైన ఈ మూవీకి జస్బీర్ భాటి దర్శకత్వం వహించారు. భారతదేశంలోని గ్రామీణ స్త్రీల జీవిత పరిస్థితులను చూపించారు. సమాజంలో కొంతమంది పెద్ద మనుషుల చేతిలో బలయ్యే అమాయకుల జీవితాలతో ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీలో మాషా పౌర్, రఘుబీర్ యాదవ్, కునిక, శక్తి కపూర్, ఆదిత్య పంచోలి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఉత్తరప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామంలో ధన్వార్ అనే 40 సంవత్సరాల వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. ఇతనికి వయసు పైబడినా, పెళ్లి కాకపోవడంతో బాధపడుతూ ఉంటాడు. అయితే 30 సంవత్సరాల వయసున్న భూరి అనే ఒక అందమైన అమ్మాయితో ఇతనికి పెళ్లి జరుగుతుంది. ఆమె అందాన్ని చూసి ఆ ఊరి పెద్దలు, ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ పెద్ద మనుషుల దగ్గరే ధన్వార్ పనిచేస్తుండడంతో మొదట అతన్ని పనిలో నుంచి తీసేస్తారు. ఆ ఇంటికి ఇన్కమ్ లేకపోవడంతో భార్యను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్లకు లొంగకూడదు అనుకుంటారు. ఈ క్రమంలో ధన్వార్ ఆరోగ్యం బాగాలేక పోతుంది. అతనికి ఎయిడ్స్ ఉందని ఆ ఊరి పెద్ద మనుషుల ప్రచారం చేస్తారు. తన వల్ల ఎవరికి ప్రాబ్లం రాకూడదని, ఊరి చివర గుడిశ వేసుకుని ఉంటాడు ధన్వార్. ఆ తర్వాత ఆ ఊరికి పట్టణం నుంచి వచ్చిన ఒక వ్యక్తి భూరికి పరిచయం అవుతాడు. ఒకరోజు అనుకోకుండా వీళ్లిద్దరు ఏకంతంగా గడుపుతారు.

ఆ తర్వాత ఈ విషయం ఆ ఊరి పెద్ద మనుషులు తెలుసుకుంటారు. భూరిని ఊరి నుంచి వెళ్లగొట్టడానికి పంచాయతీ పెడతారు. అయితే అక్కడ ఉన్న ఒక మహిళ వాళ్ళని అడ్డుకుంటుంది. మీరు ఎలాంటి వాళ్ళో ఇక్కడ ఉన్న వాళ్లకు తెలుసంటూ గొడవ పడుతుంది. ఆ తర్వాత భూరిని ఆమె భర్త కూడా దూరం పెడతాడు. చివరికి భూరి పెద్దమనుషులకు లొంగిపోతుంది. వాళ్ళే కాకుండా ఆఊరిలో చాలామంది భూరితో గడుపుతారు. భూరి ఎందుకు అందరితో ఆ పని చేస్తుంది? భర్తకు ఈ విషయం తెలుస్తుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘భూరి’ (Bhouri) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×