E-Paper
Advertisement

OTT Movie: పెళ్లికి ఒప్పుకోలేదని పాడు పని… మైండ్ బ్లాక్ అయ్యే రివేంజ్ స్టోరీ బ్రో

OTT Movie: పెళ్లికి ఒప్పుకోలేదని పాడు పని… మైండ్ బ్లాక్ అయ్యే రివేంజ్ స్టోరీ బ్రో
Advertisement

OTT Movie : బాలీవుడ్ సినిమాలకి మన ప్రేక్షకులు ఎప్పటినుంచో అభిమానులు గా ఉన్నారు. అందులోనూ సంజయ్ దత్ సినిమాలంటే చెవి కోసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తండ్రి, కూతుర్ల ఎమోషన్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కూతురుకి జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకోవడమే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

యూట్యూబ్ (Youtube)లో

Advertisement

ఈ బాలీవుడ్ యాక్షన్ డ్రామా మూవీ పేరు ‘భూమి’ (Bhoomi). దీనికి ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించి, నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీలో సంజయ్ దత్, అదితి రావ్ హైదరి, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఆగ్రాలో జరుగుతుంది. ఒక తండ్రి, కుమార్తె మధ్య సంబంధం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. వాళ్ళు ఒక దారుణమైన సంఘటనను ఎదుర్కుంటారు. ఆ తరువాత వీళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక తండ్రి-కుమార్తె బంధం ఆధారంగా రూపొందిన ప్రతీకార డ్రామా మూవీ. యూట్యూబ్ (Youtube) లో ఈ యాక్షన్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

అరుణ్ సచ్దేవ ఒక సాధారణ చెప్పులు కుట్టే వ్యక్తి . ఇతనికి భార్య చనిపోవడంతో కూతురు భూమితో కలసి ఉంటాడు. తన కుమార్తె భూమిని చాలా ప్రేమగా చూసుకుంటాడు తండ్రి. భూమి తన స్నేహితుడు నీరజ్ ని ప్రేమించి, అతనితోనే వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదే క్రమంలో పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. అయితే ఈ వివాహానికి ఒక రోజు ముందు, భూమిని విషాల్ అనే స్థానిక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. విషాల్, తన బంధువు ధౌలీ, డేఢా అనే గ్యాంగ్‌స్టర్‌లతో కలిసి భూమిపై సామూహిక అత్యాచారం చేస్తారు. ఈ దారుణ సంఘటన తర్వాత, నీరజ్ వివాహాన్ని రద్దు చేసుకుంటాడు. దీంతో అరుణ్, భూమి చాలా బాధ పడతారు. అరుణ్ పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ, అతనికి న్యాయం జరగదు. ఈ విషయం తెలిసి వాళ్ళు మళ్ళీ భూమిని మరోసారి కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. ఆమె తీవ్ర గాయాలతో బతికి బయటపడుతుంది.

కోర్టులో కేసు విచారణ జరిగినప్పటికీ, నిందితులు తప్పించుకుంటారు. ఈ సంఘటన అరుణ్, భూమి జీవితాలను తలక్రిందులు చేస్తాయి. సమాజంలో అవమానాలను ఎదుర్కొన్న భూమి, తనపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. అరుణ్, భూమి కలిసి నిందితులను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటారు. మొదట జీతూ అనే వ్యక్తిని హత్య చేస్తారు, ఆ తర్వాత డేఢాను రైలు కింద పడేసి చంపుతారు. విషాల్‌ను బస్సులో బంధించి అతన్ని చేతులారా చంపి పగ తీర్చుకుంటారు. చివరగా ధౌలీని ఒక ఆలయం వద్ద చంపి, వాళ్ళ ప్రతీకారాన్ని పూర్తి చేస్తారు. ఈ మూవీ సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను హైలైట్ చేస్తుంది. సంజయ్ దత్ శక్తివంతమైన నటన, అదితి రావ్ హైదరి సున్నితమైన పాత్ర ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×