E-Paper
Advertisement

Horror Movie in OTT: మనుషులను పీక్కుతినే దెయ్యాలు.. ఒళ్లు గగూర్పొడిచే సీన్లు.. దైర్యం ఉంటేనే చూడండి…

Horror Movie in OTT: మనుషులను పీక్కుతినే దెయ్యాలు.. ఒళ్లు గగూర్పొడిచే సీన్లు.. దైర్యం ఉంటేనే చూడండి…
Advertisement

Horror Movie in OTT: హారర్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువ. భయంకరమైన యాక్షన్ సీన్లు ఉండే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే మేకర్స్ ఈ మధ్య ఇలాంటి సినిమాలనే అందిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా దెయ్యాల స్టోరీతో వచ్చే సినిమాలు మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి. తాజాగా ఓ భయంకరమైన హారర్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..

స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

దెయ్యాల పేరు చెబితేనే చాలా మంది వణికిపోతారు. అయితే హాస్పిటల్ లో దెయ్యాలు ఉంటాయా? ఉంటే ఎక్కడ ఉంటాయి.. మనుషులకు ఏ మాత్రం హాని కలిగిస్తాయి. ఇలా అనేక సందేహాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకొనే మూవీ భయంకరమైన స్టోరీ ఇది. హాలీవుడ్‌లో మ్యాన్ ఈటర్ మూవీ అందరికి గుర్తు ఉంటుంది. అంటే మనుషులను పీక్కు తినే దెయ్యాలు.. అలాంటి స్టోరీతో ఈ మూవీ వచ్చింది. ఇదే భవాని వార్డు. హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆడియన్స్‌ను భయపెట్టేలా ఈ సాగుతుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్లాలి. కానీ, అలా వెళ్లకుండా అదే ఆత్మ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. పగలంతా ప్రశాంతంగా ఉన్న ఆ వార్డులోకి రాత్రి 8 అయితే ఏ ఒక్కరూ ప్రవేశించరు. అక్కడ దెయ్యాలు ఉంటాయని జనాలు నమ్ముతుంటారు. అయితే ఈ విషయం తెలిసి కూడా ఒక డాక్టర్ పేషెంట్‌ను తీసుకుని వెళుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ డాక్టర్, పేషెంట్ కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది మిస్ అవ్వకుండా చూడాలి అంటే మాత్రం ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Also Read : ఊహించని ట్విస్టులతో స్టోరీ.. దోపిడీ చేసే అమ్మాయిలు.. క్లైమాక్స్ పీక్స్..

Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

ఈ దెయ్యాల స్టోరీతో వచ్చిన మూవీ థియేటర్లలో మిక్సీ్డ్ టాక్ ను తెచ్చుకుంది.. ఇందులో పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో ఆడియెన్స్ ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. గాయత్రీ గుప్తా, గణేశ్‌ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్‌ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి భవానీ వార్డ్ 1997 మూవీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ఈ మధ్య కొత్త సినిమాలు ఇక్కడ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా అమెజాన్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. జూలైలో వచ్చేస్తున్న సినిమాలు ఈ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×