E-Paper
Advertisement

IMDbలో 7.7 రేటింగ్‌ ఉన్న ఈ కాప్-డ్రామాను ఫ్రీగానే చూడొచ్చు

IMDbలో 7.7 రేటింగ్‌ ఉన్న ఈ కాప్-డ్రామాను ఫ్రీగానే చూడొచ్చు
Advertisement

Crime Thriller Series on OTT : ఉత్తర ప్రదేశ్‌లో ఒకానొక టైంలో చట్టం కాదు, భయం, తుపాకుల భాషే రాజ్యమేలేది. సూర్యాస్తమయం అయ్యాక ఇంటి బయటకు రావడానికి కూడా సామాన్యులు భయపడే నగరం అది. రెండు పెద్ద నేర ముఠాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా పట్టి పీడించేవి. ఆ సమయంలో ఒక ధైర్యవంతుడు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ నేర సామ్రాజ్యాన్ని ఒంటరిగా ఎదిరించాడు. అతను ఐపీఎస్ అధికారి నవీన్ సికేరా. ఈ నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘భౌకాల్’. 2020లో విడుదలైన ఈ సిరీస్ ఇప్పటికీ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌ ఫేవరెట్‌ సిరీస్ ల లిస్ట్ లో ఉంది. ముజఫర్‌ నగర్‌లోని నిజ ఘటనల నుంచి ప్రేరణ పొంది తీసిన ఈ సిరీస్ చాలా రియల్‌ గా, భయపెట్టేలా ఉంటుంది.

కథ ఏమిటి ?

నవీన్ సికేరా (మోహిత్ రైనా) అనే ధైర్యవంతుడైన ఐపీఎస్ అధికారి ముజఫర్‌ నగర్‌ కు బదిలీ అవుతాడు. అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా కరువైపోయి ఉంటాయి. షౌకీన్ గ్యాంగ్, చింటూ-పింటూ వంటి స్థానిక బలవంతులు రాజకీయ అండదండలతో నగరాన్ని పట్టి పీడిస్తుంటారు. సాధారణ ప్రజలు భయంతో బతుకుతుంటారు. ఈ అరాచకానికి చెక్ పెట్టాలని నవీన్ సికేరా ఒంటరిగా యుద్ధం మొదలు పెడతారు. అవినీతి, భయం, రాజకీయ ఒత్తిళ్లు… అన్నీ ఎదుర్కొంటూ అతను నేరస్తులను ఒక్కొక్కరిగా ఎదిరిస్తాడు. ఈ పోరాటంలో అతని ధైర్యం, తెలివితేటలు ఎలా పని చేస్తాయో చూస్తే నిజంగా బుర్రపాడు అవుతుంది. మరి ఆ పోలీస్ ఒక్కడే అందరినీ ఎలా ఎదిరించాడు ? అతన్ని విలన్లు ఎలా ముప్పుతిప్పలు పెట్టారు ? ఫైనల్ గా హీరో వీళ్ళ భరతం పట్టడానికి ఏం చేశాడు ? అన్నది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Also Read : 2 గంటల 41 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… ఫహద్ ఫాజిల్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరు

ఎక్కడ చూడాలి ?

ఈ సిరీస్‌ ను MX Playerలో ఫ్రీగా చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు సీజన్లు వచ్చాయి. ప్రతి సీజన్‌ లో 10 ఎపిసోడ్‌లు ఉంటాయి. IMDbలో 7.8 రేటింగ్‌ ఉన్న ఈ సిరీస్ చాలా మంది ప్రశంసలు అందుకుంది. ఇందులో మోహిత్ రైనా నవీన్ సికేరా పాత్రలో బాగా తన స్టైల్‌ లో కనిపిస్తాడు. అభిమన్యు సింగ్ (షౌకీన్), సిద్ధాంత్ కపూర్ (చింటూ), ప్రదీప్ నగర్ (పింటూ), బిదితా బాగ్, గుల్కీ జోషి వంటి నటీనటులు కూడా బాగా నటించారు.జతిన్ వాగ్లే దర్శకత్వం వహించాడు. నిజ ఘటనలను చాలా వాస్తవికంగా తెరపైకి తీసుకువచ్చాడు దర్శకుడు.ఈ సిరీస్ నిజంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఒకే ఒక్కడే ఎంత మార్పు తెచ్చిపెట్టగలడు ? అనేది ఈ సిరీస్ ద్వారా అర్థమవుతుంది. క్రైమ్, యాక్షన్, థ్రిల్ ఇష్టపడేవాళ్లు తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది, డోంట్ మిస్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×