E-Paper
Advertisement

Revenge Drama OTT : చెల్లి చావుకు అక్క రివేంజ్… ఒక్కో ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్

Revenge Drama OTT : చెల్లి చావుకు అక్క రివేంజ్…  ఒక్కో ట్విస్ట్ కి ఫ్యూజులు అవుట్
Advertisement

Revenge Drama OTT : థ్రిల్లర్ స్టోరీలు ఇచ్చే కిక్ మరే సినిమాలు ఇవ్వలేవు. ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ని సస్పెన్స్ తో టెన్షన్ పెడుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక తమిళ థ్రిల్లర్ గురించి చెప్పుకుందాం. ఈ సినిమా చాలా ట్విస్టులతో నడుస్తుంది. క్లైమాక్స్ వరకు అసలు విషయం తెలియదు. ఒక జంట సరదాగా గడపడానికి నిర్మానుష్యంగా ఉన్న ఒక బీచ్ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ వాళ్ళకి కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ సినిమా టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌తో సాగుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బెస్టీ’ (Bestie). 2022లో విడుదలైన ఈ సినిమా రంగా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో అశోక్ కుమార్, యషికా ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించారు. 2022 జూలై 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అశోక్, యషికా అనే ప్రేమికులు ఏకాంతంగా గడపడానికి సిటీకి దూరంగా ఉన్న ఒక రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పటి నుండి వాచ్‌మెన్, డెలివరీ బాయ్ వంటి వ్యక్తులు పదేపదే వచ్చి వారిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. అయితే ఇదంతా ఒక టైమ్ లూప్ లాగా మళ్ళీ మళ్ళీ జరుగుతూ అశోక్‌ను అయోమయానికి గురి చేస్తుంది. కానీ క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. అశోక్ గతంలో యషికా సోదరిపై అఘాయిత్యం చేసి చంపేసి ఉంటాడు. ఆ పగ తీర్చుకోవడానికి యషికా, ఆమె కుటుంబ సభ్యులు కలిసి అతన్ని ఆ రిసార్ట్‌కు రప్పిస్తారు. అక్కడ అతనికి పిచ్చి పట్టేలా చేసి, చివరకు పక్కా ప్లాన్‌తో అతన్ని చంపేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే, తప్పు చేసిన వాడిని ఒక అమ్మాయి ప్లాన్ చేసి ఎలా అంతం చేసిందనేదే ఈ సినిమా కథ.

Read Also :  ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×