E-Paper
Advertisement

ప్రతీ ఎపిసోడ్ ఒక మాస్టర్ పీస్… పక్కా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇవి చూడాల్సిందే

ప్రతీ ఎపిసోడ్ ఒక మాస్టర్ పీస్… పక్కా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇవి చూడాల్సిందే
Advertisement

Best Web Series on OTT : డిజిటల్ విప్లవం పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంటెంట్ మన స్మార్ట్ ఫోన్లలోకి వచ్చేసింది. అయితే వందల కొద్దీ ఆప్షన్ల మధ్య ఏది చూడాలో తెలియక సతమతమయ్యే ప్రేక్షకులకు కొన్ని సిరీస్‌లు మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీగా ఇస్తాయి. డ్రామా, క్రైమ్, ఎమోషన్స్.. ఇలా ఏ జోనర్ తీసుకున్నా, కింద ఉన్న ఐదు సిరీస్‌లు ఓటీటీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.

1. డోప్‌సిక్ (Dopesick – 2021)

అమెరికాలో ఓపియాయిడ్ (మత్తుమందుల) సంక్షోభం ఎలా మొదలైందో వివరించే అత్యుత్తమ సిరీస్ ఇది. ఒక ఫార్మా కంపెనీ స్వార్థం వల్ల వేలాది మంది ప్రాణాలు ఎలా బలైపోయాయో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మైఖేల్ కీటన్ నటన ఈ సిరీస్‌కు హైలెట్ గా నిలిచింది. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో దీనిని చూడవచ్చు.

2. టైమ్ బ్యూటిఫుల్ థింగ్స్ (Tiny Beautiful Things – 2023)

Advertisement

జీవితంలో దారి తప్పిన ఒక మహిళ, ఒక కాలమిస్ట్‌గా ఇతరుల సమస్యలకు పరిష్కారం చూపుతూ తనను తాను ఎలా సరిదిద్దుకుంది అనేదే ఈ కథ. మనసును హత్తుకునే ఎమోషనల్ సీన్లు ఇందులో హైలైట్ గా ఉంటాయి. జీవితం పట్ల స్పిరిట్ ఇచ్చే సిరీస్ ఇది. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో దీనిని చూడవచ్చు.

3. పామ్ & టామీ (Pam & Tommy – 2022)

90వ దశకంలో సంచలనం సృష్టించిన పమేలా ఆండర్సన్, టామీ లీ ప్రైవేట్ వీడియో లీక్ వెనుక ఉన్న అసలు కథ ఇది. ఇంటర్నెట్ ప్రారంభ రోజుల్లో ఒక ప్రైవేట్ విషయం ఎంతటి విధ్వంసం సృష్టించిందో, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎలా బజారున పడిందో ఇందులో చూడొచ్చు. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ఇది అందుబాటులో ఉంది.

4. ద డ్రాపౌట్ (The Dropout – 2022)

Advertisement

ఎలిజబెత్ హోమ్స్ అనే ఒక యువతి ‘థెరానోస్’ అనే కంపెనీ ద్వారా ప్రపంచాన్ని ఎలా మోసం చేసిందో వివరించే బయోలాజికల్ డ్రామా ఇది. రక్తం చుక్కతో వేల పరీక్షలు చేయవచ్చని అబద్ధం చెప్పి బిలియనీర్ అయిన ఆమె పతనం ఎలా సాగిందో ఆసక్తికరంగా ఉంటుంది ఇందులో. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ఇది అందుబాటులో ఉంది.

5. నార్మల్ పీపుల్ (Normal People – 2020)

ప్రేమకథలంటే ఇష్టపడే వారికి ఇది ఒక క్లాసిక్. మేరియన్, కానెల్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ప్రేమ ప్రయాణం ఇది. హైస్కూల్ నుండి యూనివర్సిటీ వరకు వాళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ ఇందులో చాలా అద్భుతంగా ఉంటుంది. లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play), ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది.

Read Also : దేవుడికి పూజలు చేస్తుంటే మధ్యలో దెయ్యం గోల ఒకటి… బాబోయ్ ప్యాంటు తడిపించే సీన్లు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×