E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలో ఉన్న టాప్ 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్… డోంట్ మిస్

OTT Movie : ఓటీటీలో ఉన్న టాప్ 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్… డోంట్ మిస్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఉత్కంఠ భరితంగా సాగిపోయే సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఉన్న కొన్ని హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేసే రచ్చ మామూలుగా ఉండదు.  ఇందులో వచ్చే ట్విస్ట్ లు మిమ్మల్ని పిచ్చెక్కిస్తుంటాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్లు, క్రైమ్ మిస్టరీలు అదిరిపోయే ట్విస్ట్ లతో మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ను ఇస్తాయి. అలాంటి ఉత్కంఠభరితమైన హాలీవుడ్ సినిమాలు  ఏ ఓటీటీలో ఉన్నాయి ? IMDb రేటింగ్‌ ఎంత ?  ఆ సినిమాల పేరు ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

షట్టర్ ఐలాండ్ (Shutter Island)

Advertisement

2010 లో వచ్చిన ఈ మూవీకి మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించారు.  ఒక మారుమూల ప్రాంతంలో ఒక రోగి అదృశ్యం అవుతాడు. అతన్ని గుర్తించే అంశం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ క్లైమాక్స్ ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడయో (Amazon Prime Video)లో ఈ ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 8.2 రేటింగ్ ఉంది.

గాన్ గర్ల్ (Gone Girl)

Advertisement

2014 లో వచ్చిన ఈ మూవీకి  డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తన భార్య  అదృశ్యమైనప్పుడు, భర్త అనుమానితుడిగా మారతాడు. ఉత్కంఠభరితమైన స్టోరీతో ఈమూవీ నడుస్తుంది. చివరి వరకూ సస్పెన్స్ తో టెన్షన్ పెట్టిస్తుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో రేటింగ్ 8.1 ఉంది.

సెవెన్ (Se7en)

1995 వచ్చిన ఈ మూవీకి  డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించారు. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ మూవీ నడుస్తుంది.  అతన్ని పట్టుకోవడానికి పోలీసులకు చుక్కలు కనబడతాయి. భయంకరమైన క్లైమాక్స్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. IMDbలో దీనికి 8.6 రేటింగ్ ఉంది.

ది సిక్స్త్ సెన్స్ (The Sixth Sense)

1999లో వచ్చిన ఈ మూవీకి నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించారు. ఒక చిన్న బాలుడికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అతనికి ఒక సైకాలజిస్ట్ సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఆ తరువాత స్టోరీ ఎన్నో మలుపులు తిరుగుతుంది. జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఐఎండీబీలో దీనికి 8.2 రేటింగ్ ఉంది.

మెమెంటో (Memento)

2000లో వచ్చిన ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్  దర్శకత్వం వహించారు. ఒక జ్ఞాపక శక్తి కోల్పోయిన వ్యక్తి , తన భార్యని హత్య చేసిన వాడి కోసం వెతికే క్రమంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : పంప్‌సెట్ దొంగ తెచ్చిన తంటా… జీవిత కాలం వాయిదాలతో కోర్ట్ కేసు … మస్ట్ వాచ్ మలయాళం మూవీ గురూ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×