E-Paper
Advertisement

Best Prime Video Movie : ఐలాండ్ లో అన్నదమ్ముల అరాచకం… పెళ్లి పేరుతో పాడు పనులు… మామూలు యవ్వారం కాదయ్యో ఇది

Best Prime Video Movie : ఐలాండ్ లో అన్నదమ్ముల అరాచకం… పెళ్లి పేరుతో పాడు పనులు… మామూలు యవ్వారం కాదయ్యో ఇది
Advertisement

Best Prime Video Movie : ఓటీటీలో ఒక రొమాంటిక్ కామెడీ మూవీ క్రేజీ మూమెంట్స్‌తో కావాల్సినంత ఫన్ ఇస్తోంది. ఈ చిత్రం, ఇద్దరు సోదరులు తమ సిస్టర్ పెళ్లికి మంచి అమ్మాయిలను డేట్స్‌గా తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు దొరికిన అమ్మాయిలు పూర్తి వైల్డ్. ఈ నలుగురు చేసే రచ్చని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ సినిమా క్లైమాక్స్ వరకు కామెడీతో కేరింతలు పెట్టిస్తోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2016లో వచ్చిన ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘మైక్ అండ్ డేవ్ నీడ్ వెడ్డింగ్ డేట్స్’ (Mike and Dave Need Wedding Dates). జేక్ సిమండ్స్ దర్శకత్వంలో జాక్ ఎఫ్రాన్, ఆడమ్ డివైన్, అన్నా కెండ్రిక్, ఆబ్రీ ప్లాజా లీడ్ రోల్స్‌లో నటించారు. 2016 జులై 8న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం Prime Videoలో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ డబ్బింగ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : భర్త టార్చర్ తట్టుకోలేక పారిపోయిన భార్యకు బుర్ర బద్దలయ్యే షాక్… హర్రర్ తో పాటు ఫ్యూజులు అవుటయ్యే సీన్స్

స్టోరీ ఏమిటంటే

మైక్, డేవ్ అనే ఇద్దరు సోదరులు ఎప్పుడూ పార్టీలకు తిరుగుతుంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్లినా గందరగోళం సృష్టిస్తారు. వాళ్ల ఫ్యామిలీ ఈవెంట్స్ అన్నీ వాళ్ల వల్ల డిస్టర్బ్ అవుతుంటాయి. ఇప్పుడు వాళ్ల చెల్లెలు జీనీ హవాయిలో గ్రాండ్ పెళ్లి చేసుకుంటుంది కాబట్టి, తల్లిదండ్రులు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇస్తారు. మీరిద్దరూ మంచి, రెస్పాన్సిబుల్ అమ్మాయిల్ని డేట్స్‌గా తీసుకురండి, లేకపోతే పెళ్లికి రావద్దు అని కండిషన్ పెడతారు. దీంతో ఈ సోదరులు ఆన్‌లైన్‌లో అడ్ పెట్టి అందమైన అమ్మాయిలకు ఫ్రీ హవాయి ట్రిప్ ఆఫర్ చేస్తారు. అది వైరల్ అయి టీవీలో కూడా వస్తుంది.

Advertisement

అలిస్, టాటియానా అనే ఇద్దరు సూపర్ వైల్డ్ అమ్మాయిలు ఆ అడ్ చూసి, మంచి అమ్మాయిలుగా యాక్ట్ చేసి సోదరుల్ని ఇంప్రెస్ చేస్తారు. అయితే హవాయి చేరుకున్నాక వాళ్ల నిజ స్వరూపం బయటపడుతుంది. డ్రింక్, డ్రగ్స్ పార్టీలతో హోరెత్తిస్తారు. ఆ పెళ్లి కూడా పూర్తి కావ్‌స్ అవుతుంది. మధ్యలో మైక్-అలిస్, డేవ్-టాటియానా మధ్య రొమాన్స్ పుడుతుంది. కానీ అది కూడా క్రేజీగా సాగుతుంది. చివర్లో ఈ పెళ్లి సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుందా ? మైక్, డేవ్ ప్రేమ కథలు ఏమవుతాయి ? అనే విషయాలను, ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×