E-Paper
Advertisement

OTT Movie : ఈ వారం ఓటీటీలో చూడాల్సిన మలయాళం సినిమాలు ఇవే… ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా ?

OTT Movie : ఈ వారం ఓటీటీలో చూడాల్సిన మలయాళం సినిమాలు ఇవే… ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా ?
Advertisement

OTT Movie : మలయాళ సినిమా లవర్స్ కి ఈ వీకెండ్ లో చూడాటానికి ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. రోడ్ డ్రామా, బ్లాక్ కామెడీ, గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ స్టోరీలతో మిమ్మల్ని కుర్చీలోనే ఉంచుతాయి. థియేటర్ రన్ తర్వాత ఈ మలయాళ సినిమాలను, ఒక్కసారి ప్లే చేస్తే ఆపడం కూడా కష్టమే. ఫ్యామిలీతో కలసి ఈ సినిమాలను చూస్తూ, ఈ వీకెండ్ కి బిగ్ ట్రీట్ కి ప్లాన్ చేసుకోండి. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయి ? వీటి పేర్లు ఏమి ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

‘ది పెట్ డిటెక్టివ్’ (The Pet Detective)

టోనీ అనే యువకుడు తన చైల్డ్‌హుడ్ స్వీట్‌హార్ట్ కైకేయి, ఆమె తండ్రిని ఇంప్రెస్ చేయడానికి డెటెక్టివ్ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. మొదటి కేస్ ఒక మిస్సింగ్ డాగ్‌ ను కనిపెట్టాల్సి వస్తుంది. అయితే ఆ కేస్ ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రాకెట్ కి లింక్ అవుతుంది. చివరికి టోనీ ఆ కుక్కతో పాటు క్రిమినల్స్ ని పట్టుకుంటాడా? కైకేయి ఫ్యామిలీని ఇంప్రెస్ చేస్తాడా ? అనే అంశాలతో ఈ కథ ఉంటుంది. ఈ సినిమా ZEE5లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

‘ప్రైవేట్‌’ (Private)

Advertisement

ఈ స్టోరీ ఒక పాలిటీషియన్ (ఓల్డ్ మ్యాన్), ఒక టీనేజ్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఒక రోడ్ ట్రిప్‌లో వీళ్ళు కలుస్తారు. సుదూర ప్రయాణం సాగే ఈ జర్నీ లో ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఇది రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమా Manorama Max లో నవంబర్ 21 నుంచి అందుబాటులో ఉంది.

‘అవిహితం’ (Avihitham)

ఒక గ్రామంలో ఒక అమ్మాయి-అబ్బాయి రాత్రి కలుసుకున్నారని గాసిప్ వైరల్ అవుతుంది. గ్రామస్తులు వాళ్ళను పట్టుకోవడానికి స్కెచ్ లు వేస్తారు. చివరికి ట్విస్ట్ కి జనం అంతా అందరూ షాకవుతారు. సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ అక్రమ సంబంధం చుట్టూ, నవ్వులు పూయిస్తూ తిరుగుతుంది. Jio Hotstar లో ఈ సినిమా నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

‘సంఘర్ష ఘదన’ (Sangharsha Ghadana)

Advertisement

ఒక పాత గ్యాంగ్‌స్టర్ ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకుంటాడు. అలాగే జీవితం కూడా మొదలు పెడతాడు. అయితే ఈ సమయంలో ఎవరో అతని గ్యాంగ్ మీద దాడి చేస్తుంటే మళ్లీ తిరిగి వచ్చి ఫైట్ చేస్తాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు, డీప్ మెసేజ్ కూడా ఉంటుంది. Sun NXT లో ఈ సినిమా నవంబర్ 14 నుంచి అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×