// // Best Korean Web Series 2024 in OTT : 2024లో నెట్ ఫ్లిక్స్ లో కేక -->
E-Paper
Advertisement

Best Korean Web Series 2024 in OTT : 2024లో నెట్ ఫ్లిక్స్ లో కేక పుట్టించిన బెస్ట్ కొరియన్ డ్రామాలు ఇవే

Best Korean Web Series 2024 in OTT : 2024లో నెట్ ఫ్లిక్స్ లో కేక పుట్టించిన బెస్ట్ కొరియన్ డ్రామాలు ఇవే
Advertisement

Best Korean Web Series 2024 in OTT : కొరియన్ డ్రామాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ముఖ్యంగా ఇండియాలో కొరియన్ వెబ్ సిరీస్ ల హవా ఎక్కువగా నడుస్తోంది. జానర్ తో సంబంధం లేకుండా కొరియన్ డ్రామా అయితే చూసేద్దాం అన్నట్టుగా ఉన్నారు ఓటీటీ లవర్స్. అందులో భాగంగానే 2024లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన కొన్ని బెస్ట్ కొరియన్ డ్రామాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు కేవలం ఎంటర్టైన్ చేయడమే కాకుండా కథ, కథనాలతో చూసిన ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశాయి. మీరు కూడా కొరియన్ డ్రామాలంటే చెవి కోసుకునే వారే అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయిన బెస్ట్ కొరియన్ డ్రామాలు ఏంటో తెలుసుకుందాం పదండి. మరి 2024 నెట్ ఫ్లిక్స్ బెస్ట్ కొరియన్ డ్రామాల లిస్ట్ లో ఏమున్నాయంటే ?

ది టేల్ ఆఫ్ లేడీ ఓకే (The Tale of Lady Ok)

Advertisement

ఈ డ్రామా జోసెయోన్ కాలంలో జరిగిన ఓకే టే యంగ్ అనే ఒక స్లేవ్ గర్ల్ కథ. టే యంగ్ తన గుర్తింపును దాచిపెట్టి, న్యాయ నిపుణురాలిగా మారి, అవసరమైన వ్యక్తులకు సహాయం చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ కథ, కథనం అద్భుతంగా ఉంటాయి. ఆమె గురించి నిజం తెలిశాక ఏం జరిగింది? ఆ పరిస్థితులను ఆ అమ్మాయి ఎలా ఎదుర్కొంది ? అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

లవ్లీ రన్నర్ (Lovely Runner)

Advertisement

ఈ వెబ్ సిరస్ ఓ నవల ఆధారంగా రూపొందింది. ఈ కొరియన్ డ్రామాలో బియోన్ వూ-సియోక్, కిమ్ హే-యూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ కథ ఒక క్రీడాకారుడి జర్నీ, అతని రొమాంటిక్ లైఫ్ ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

క్వీన్ ఆఫ్ టియర్స్ (Qween of Tears)

ఈ వెబ్ సిరీస్ పెళ్ళయిన జంట సమస్యాత్మక జీవితం ఆధారంగా తెరకెక్కింది. ‘క్వీన్ ఆఫ్ టియర్స్’ అనే ఈ కొరియన్ డ్రామా బంధాల విలువను తెలియజేస్తుంది. అలాగే వెబ్ సిరీస్ ను చూస్తున్నంతసేపు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన కిమ్ సూ-హ్యూన్, కిమ్ జి-వోన్ తమ పాత్రలకు జీవం పోశారు. ప్రస్తుతం ఈ సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Mr. ప్లాంక్టన్ (Mr. Plankton)

ఒక ప్రాణాంతకమైన జబ్బు బారిన పడిన వ్యక్తి, దురదృష్టవంతురాలైన స్త్రీ చుట్టూ తిరిగే కథ ‘Mr. ప్లాంక్టన్’. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇందులో నటీనటులు వూ దో-హ్వాన్, లీ యో-మిల జంట కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగే మనసారా ఏడిపిస్తుంది కూడా. మరి మీరు కూడా ఈ ఏడాది ఈ వెబ్ సిరీస్ లను చూశారా? ఒకవేళ ఇప్పటిదాకా చూడకుండా మిస్ చేసి ఉంటే, తప్పకుండా చూడండి. ముఖ్యంగా కొరియన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు డోంట్ మిస్.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×