E-Paper
Advertisement

OTT Movie : మిస్ అవ్వకుండా చూడాల్సిన హార్రర్ సినిమాలు… రాత్రి పూట ఒంటరిగా చూశారో వణుకే

OTT Movie : మిస్ అవ్వకుండా చూడాల్సిన హార్రర్ సినిమాలు… రాత్రి పూట ఒంటరిగా చూశారో వణుకే
Advertisement

OTT Movie : హారర్ సినిమాలంటేనే ఆమడ దూరం ఉంటారు కొంత మంది.  అందులోనూ ఇండొనేషియన్ హారర్ సినిమాలంటే ప్యాంట్ తడిపేసుకుంటారు చాలామంది. ఈ సినిమాలు ఎక్కువగా భయపెడుతుంటాయి. చేతబడి, దెయ్యాలు, ఆత్మల సినిమాలను తీయాడంలో వీళ్ళు బాగా స్పెషలిస్ట్ లు అయిపోయారు. వీటిని ఒంటరిగా చూసారంటే, పై ప్రాణాలు పైకి పోవడం ఖాయం. ఇప్పుడు మనం కొన్ని భయంకరమైన ఇండొనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం . ఈ హారర్ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.  ఈ వీకెండ్ రాత్రిపూట వీటిని ఒంటరిగా చూడటానికి ప్రయత్నించండి.

‘ది థర్డ్ ఐ’ (The 3rd eye)

Advertisement

2017 లో విడుదలైన ఈ ఇండోనేషియన్ మూవీకి రాకీ సొరయా దర్శకత్వం వహించారు. రిహెమ్ జునియాంటి, రాకీ సొరయా దీనిని రచించారు.  ఈ స్టోరీ ఒక అబెల్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది.  ఆమె కుటుంబంలో దాగిఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరి వరకూ ఈ సినిమా ప్రేక్షకులను వణికిస్తూనే ఉంటుంది.

ఇండిగో (Indigo)

Advertisement

ఈ ఇండోనేషియన్ హారర్ మిస్టరీ సినిమా 2023లో విడుదలైంది. దీనికి రాకీ సొరాయ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ జోరా అనే యువతి చుట్టూ తిరుగుతుంది.  ఆమె చిన్నతనం నుండి ‘ఇండిగో’ అనే పేరుతో పిలువబడుతుంది. ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని అందరూ అనుకుంటుంటారు. జోరా కి ఒక చెల్లెలు ఉంటుంది. ఆమెను ఒక దెయ్యం వేధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జోరా  తన శక్తులను ఉపయోగించి, తన చెల్లెల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ లు ఎదురౌతాయి.

 ‘కుయాంగ్’ (Kuyang)

2024 లో విడుదలైన ఇండోనీషియన్ హారర్ సినిమాకు యొంగి ఎంగేస్తూ దర్శకత్వం వహించారు. ఇది ఒక నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా స్టోరీ బోర్నియో దీవిలోని జరుగుతుంది. ఆ దీవిలో ఉన్న ఒక గ్రామానికి భార్య భర్తలు కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి వస్తారు. భార్య  ప్రెగ్నెంట్ గా ఉండటంతో, ఒక దెయ్యం వీళ్ళ వెంటపడుతుంది. చాలా రోజుల నుంచి ఆ దెయ్యం గర్భిణీలను వెంటాడుతూ ఉంటుంది.

‘బాయి అజాయిబ్’ (Bayi Ajaib)

 2023 లో విడుదలైన ఈ ఇండోనేషియన్ హారర్ మూవీకి రాకో ప్రిజంతో దర్శకత్వం వహించారు.  ఇది 1982లో వచ్చిన ఒక ఇండోనేషియన్ హారర్ క్లాసిక్ మూవీకి రీమేక్ గా వచ్చింది. ఇందులో ఒక ధన వంతుడికి ఒకరోజు కూతురు పుడుతుంది. పుట్టుకతోనే ఒక దుష్ట శక్తి ఆ బిడ్డని ఆవహిస్తుంది. ఆ ఊరిలో కొంత మందిపై ప్రతీకారం తీర్చుకోవడానికే, ఆ బిడ్డలోకి ఆవహిస్తుంది దుష్ట శక్తి ఆవహిస్తుంది. ఆతరువాత ఒక్కొక్కరికి నరకం చూపిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కో స్టోరీ ఒక్కోలా, ప్రేక్షకులకి వెన్నులో వణుకు పుట్టిస్తాయి ఈ ఇండోనీషియన్ హారర్ సినిమాలు. 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×