E-Paper
Advertisement

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా
Advertisement

OTT Movie : హాలోవీన్ సీజన్ మళ్లీ వచ్చేసింది. రాత్రి ఒంటరిగా కూర్చుని భయాన్ని రుచి చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ 5 హారర్ సినిమాలు మిస్ చేయకండి. ఇవన్నీ కూడా ఒకే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. Netflixలో ఉన్న ఈ సినిమాలను చూస్తే, రాత్రి పూట భయంతో దుప్పటి కప్పుకుని పడుకుంటారు. ఈ లిస్ట్‌లో డెమోనిక్ టాక్ షోలు, అడవి మోన్స్టర్స్, హాన్టెడ్ హౌస్‌లు, వాల్‌లో దాచిన సీక్రెట్స్, మ్యూజిక్ రివెంజ్ లు ఉన్నాయి. ఈ ఐదు సినిమాలన్నీ కలిపి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంటాయి.

1. Late Night With The Devil (2023)

ఒక టీవీ షోలో డెమన్ ఎంట్రీ తో ఈ సినిమా హడలెత్తిస్తుంది. జాక్ అనే ఈ షో హోస్ట్ రేటింగ్స్ పెంచుకోవడానికి, ఒక దెయ్యం పట్టిన లిల్లీ అనే అమ్మాయిని లైవ్ షోకి తీసుకొస్తాడు. షో స్టార్ట్ అయ్యాక డెమన్ బయటకు వచ్చేస్తుంది. గెస్ట్స్ కూడా చచ్చిపోతారు. స్టూడియో ఒక నరకంగా మారుతుంది. ఈ కథ 1970ల కాలం నాటి టీవీ లుక్ తో నడుస్తుంది. ఇది ఆడియన్స్ ని భయ పెట్టే ఒక స్మార్ట్ హారర్. 86 నిమిషాలనిడివి ఉన్న ఈ సినిమాకి, ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ఉంది. ఇది Netflixలో ఉంది.

2. The Ritual (2017)

Advertisement

అడవిలో మోన్స్టర్ హంటింగ్ లతో ఈ సినిమా వెన్నులో వణుకుపుట్టిస్తుంది. నలుగురు ఫ్రెండ్స్ స్వీడన్ అడవిలో హైకింగ్‌కి వెళ్తారు. అక్కడ వెళ్ళు దారి కనుక్కునే మ్యాప్ మిస్ అవుతారు. ఆ తరువాత ఒక భారీ మోన్‌స్టర్ వాళ్లను ఫాలో అవుతుంది. ఒక్కొక్కరు దారుణంగా చచ్చిపోతుంటారు. అడవికి వెళ్లాలను కునే వాళ్ళు దీన్ని చూస్తే మైండ్ మారిపోతుంది. 94 నిమిషాల ఈ హారర్ సినిమా, ఐయండిబిలో 6.3/10 రేటింగ్ ని పొందింది. ఇది కూడా Netflixలో అందుబాటులో ఉంది.

3. Presence (2024)

ఇందులో కొత్త ఇంట్లోకి మూవ్ అయిన ఫ్యామిలీని ఆత్మ ఫాలో అవుతుంది. వాళ్ళ జీవితాలను తలకిందులు చేస్తుంది. ఇది ఒక ఎమోషనల్ హారర్ మూవీ. ఇంట్లో ఏదో ఉందని అనిపిస్తే ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి. 85 నిమిషాల ఈ సినిమా, ఐయండిబిలో 6.1/10 రేటింగ్ తో ఉంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోనే ఉంది.

4. Cobweb (2023) 

Advertisement

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ స్టోరీ, ఒక గోడలో ఉన్న ఒక సీక్రెట్ తో మొదలవుతుంది. 8 ఏళ్ల పీటర్ గోడలో నుంచి విచిత్రమైన సౌండ్స్ వింటాడు. “సేవ్ మీ” అనే మెసేజ్ కూడా వస్తుంది. గోడలో నుంచి బయటకి వచ్చిన ఆ దెయ్యం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. 88 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా, ఐయండిబిలో 5.9/10 రేటింగ్ ని పొందింది.

5. The Piper (2023)

ఇది ఒక మ్యూజికల్ రివెంజ్ హారర్ మూవీ. ఒక గ్రామంలో ప్లేగ్ వ్యాధి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఫ్లూట్ వాయించి ఎలుకలు లేకుండా చేశాడు. డబ్బు ఇవ్వకపోతే ఆ ఊరిలో ఉన్న పిల్లలను కూడా లేకుండా చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత, ఆత్మ రివెంజ్ కోసం మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఇది ఒక మ్యూజికల్ ట్విస్ట్ ఫోల్క్ హారర్. 126 నిమిషాల నిడివితో ఐయండిబిలో 5.6/10 రేటింగ్ ని కలిగి ఉంది.

Read Also : థియేటర్లను వణికిస్తున్న మలయాళం మిస్టరీ హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×