E-Paper
Advertisement

ప్రతి క్షణం మిమ్మల్ని భయపెట్టే హాలీవుడ్ హారర్ మూవీస్… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది

ప్రతి క్షణం మిమ్మల్ని భయపెట్టే హాలీవుడ్ హారర్ మూవీస్… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది
Advertisement

Best Horror Movies on OTT : హారర్ సినిమాలంటే జస్ట్ దెయ్యాలు అరిచి భయపెట్టడం కాదు, సినిమా అయిపోయాక కూడా ఆ సీన్లు మన కళ్లముందే కదలాడాలి. అలాంటి పిచ్చెక్కించే ఏడు సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇవి చూసేటప్పుడు మాత్రం ఒంటరిగా ఉంటే కొంచెం కష్టమే. వీటి కంటెంట్ కూడా అలా ఉంటుంది మరి.

1. Deathdream (1974)

ఒక యుద్ధంలో కొడుకు చనిపోయాడని ఒక ఫ్యామిలీకి వార్త అందుతుంది. కానీ కట్ చేస్తే, ఆ అబ్బాయి సడన్‌గా ఇంటికి తిరిగి వస్తాడు. అయితే వాడు వచ్చినప్పటి నుండి ఇంట్లో అంతా వింతగా జరుగుతుంటుంది. వాడు అసలు మనిషేనా లేక ఇంకేదైనా నా? అనేది చాలా భయానకంగా చూపిస్తారు ఇందులో. ఇది Amazon Prime Video అందుబాటులో ఉంది.

2. Eden Lake (2008)

Advertisement

ఇందులో దెయ్యాలు ఉండవు కానీ, దెయ్యాల కంటే భయంకరమైన మనుషులు ఉంటారు. ఒక జంట సరదాగా ట్రిప్‌కి వెళ్తే, అక్కడ కొందరు కుర్రాళ్లు వాళ్ళని ఎలా టార్చర్ పెట్టారనేదే ఈ సినిమా. ఇది చూస్తుంటే కోపం, భయం కలిపి వస్తాయి. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. Amazon Prime Videoలో దీనిని చూడవచ్చు.

3. Hush (2016)

ఈ సినిమా అంతా ఒకే ఇంట్లో జరుగుతుంది. హీరోయిన్‌కి మాటలు రావు, చెవులూ వినిపించవు. అలాంటి అమ్మాయిని చంపడానికి ఒక సైకో వస్తాడు. ఆమె వాడి నుండి ఎలా తప్పించుకుంది అనేది చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఊపిరి బిగబట్టి చూడాలి ఈ సినిమాని. Netflix ఈ సినిమా అందుబాటులో ఉంది.

4. I See You (2019)

Advertisement

ఒక ఊరిలో చిన్న పిల్లలు మాయమవుతుంటారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి.. అది అస్సలు ఎవరూ ఊహించలేరు. దీనిని మీరు Netflix, Amazon Prime Videoలో చూడవచ్చు.

5. Oculus (2013)

ఒక పాత అద్దం వల్ల ఒక ఫ్యామిలీ ఎలా రోడ్డున పడిందనేదే స్టోరీ. ఆ అద్దం ముందు నిలబడితే ఏది నిజమో, ఏది భ్రమో అస్సలు అర్థం కాదు. సైకోలాజికల్‌గా ఈ సినిమా మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఈ సినిమా చూశాక అద్దంలో మన మొహం చూసుకోవాలన్నా భయం వేస్తుంది. దీనిని Lionsgate Play, Amazon Prime Videoలో చూడవచ్చు.

6. The Devil’s Backbone (2001)

ఇది ఒక అనాథాశ్రమం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. అక్కడ ఒక చిన్న అబ్బాయి చనిపోయి దెయ్యంలా తిరుగుతుంటాడు. ఇది కేవలం భయపెట్టడమే కాదు, మంచి ఎమోషనల్ స్టోరీ కూడా. హారర్ ప్లస్ సస్పెన్స్ ఇష్టపడే వాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్. Apple TV / SonyLIVలో ఇది అందుబాటులో ఉంది.

7. The Empty Man (2020)

ఒక వింత ఆచారం వల్ల మనుషులు ఎలా చనిపోతున్నారు అనేది కథ. సినిమా స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ ‘ఎంప్టీ మ్యాన్’ అంటే ఎవరు? వాడు ఎలా వస్తాడు? అనేది చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. Jio Hotstar ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ గుండె ధైర్యం చేసి వీటిలో ఏదో ఒకటి ట్రై చేయండి. చూశాక మీకే అర్థమవుతుంది ఇవి ఎలాంటి థ్రిల్లర్ సినిమాలో.

Read Also : కారణం లేకుండా మాయమయ్యే జనాలు… మిగిలిన వాళ్ళ పరిస్థితి ఘోరం… నరాలు తెగే ఉత్కంఠ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×