// // Best giant monster movies on OTT: కింగ్ కాంగ్ లాంటి బెస్ట్ మూవీస్ -->
E-Paper
Advertisement

Best giant monster movies on OTT: కింగ్ కాంగ్ లాంటి బెస్ట్ జెయింట్ మాన్స్టర్ మూవీస్… మీరు ఇంకా చూడలేదా?

Best giant monster movies on OTT: కింగ్ కాంగ్ లాంటి బెస్ట్ జెయింట్ మాన్స్టర్ మూవీస్… మీరు ఇంకా చూడలేదా?
Advertisement

Best giant monster movies on OTT : హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాలను చిన్న పిల్లలతో సహా, పెద్దవాళ్లు కూడా చూడటానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే వీటిలో పెద్ద పెద్ద ఆకారాలతో ఉండే గాడ్జిల్లా, కింగ్ కాంగ్ వంటి సినిమాలను ఎప్పుడు వచ్చినా వదలకుండా చూస్తారు. ఈ అడ్వెంచర్ మాన్స్టర్ సినిమాలు, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని ఈ సినిమాలను మరొక్కసారి చూసేయండి. ఇలా వచ్చిన సినిమాలలో బెస్ట్ జైంట్ మాన్స్టర్ సినిమాల గురించి తెలుసుకుందాం…

కింగ్ కాంగ్ (King Kong)

Advertisement

2005 లో రిలీజ్ అయిన ఈ అడ్వెంచర్ మాన్స్టర్ మూవీకి పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నవోమి వాట్స్, జాక్ బ్లాక్, డ్రియన్ బ్రాడీ నటించారు. నటీనటులు, ఓడ సిబ్బంది స్కల్ ఐలాండ్‌కి అనుకోకుండా వెళతారు. అక్కడ వారు కాంగ్ అని పిలువబడే ఒక పురాణ జెయింట్ గొరిల్లాను ఎదుర్కొంటారు. ఆ సమయంలో ఈ గొరిల్లా ఒక అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఆ తరువాత గొరిల్లాను పట్టుకుని న్యూయార్క్ నగరానికి తీసుకువెళతారు. కింగ్ కాంగ్ చిత్రీకరణ న్యూజిలాండ్‌లో సెప్టెంబర్ 2004 నుండి మార్చి 2005 వరకు జరిగింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో సినిమా (Jio cinema) లో స్ట్రీమింగ్ అవుతోంది.

గాడ్జిల్లా (Godzilla)

Advertisement

2014 లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. లెజెండరీ పిక్చర్స్ నిర్మించగా, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ మూవీలో ఆరోన్ టేలర్-జాన్సన్, కెన్ వటనాబే, ఎలిజబెత్ ఒల్సేన్, జూలియట్ బినోచే, సాలీ హాకిన్స్, డేవిడ్ స్ట్రాథైర్న్ బ్ర,యాన్ క్రాన్స్టన్ నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

ర్యాంపేజ్ (Rampage)

2018 లో వచ్చిన ఈ ర్యాంపేజ్ మూవీకి బ్రాడ్ పేటన్ దర్శకత్వం వహించారు. ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీలో డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రపోషించగా, నవోమీ హారిస్, మాలిన్ అకెర్మాన్, జేక్ లాసీ, జో మంగనీల్లో, జెఫ్రీ డీన్ మోర్గాన్ సహాయ పాత్రల్లో నటించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా ఈ మూవీ ఏప్రిల్ 13, 2018న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $428 మిలియన్లకు పైగా వసూలు చేసింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్‌లకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

పసిఫిక్ రిమ్ (Pacific rim)

2013 లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి డెల్ టోరో దర్శకత్వం వహించారు.ఇందులో చార్లీ హున్నమ్, ఇద్రిస్ ఎల్బా, రింకో కికుచి, చార్లీ డే, రాబర్ట్ కజిన్స్కీ, మాక్స్ మార్టిని, రాన్ పెర్ల్‌మాన్ నటించారు. ఈ మూవీలో పసిఫిక్ మహాసముద్రం దిగువన ఉన్న ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ నుండి ఉద్భవించిన రాక్షస మాన్స్టర్ ను ఎదుర్కోవడానికి జైగర్‌లను సృష్టిస్తారు. ప్రతి ఒక్క దానిలో ఇద్దరు పైలట్‌ లు దీనిని  నీయాంత్రిస్తారు. ఈ మూవీని లెజెండరీ పిక్చర్స్ నిర్మించగా, వార్నర్ బ్రదర్స్ పంపిణీ చేసింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×