E-Paper
Advertisement

ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు తప్పక చూడాల్సిన కొరియన్ సిరీస్ లు…

ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు తప్పక చూడాల్సిన కొరియన్ సిరీస్ లు…
Advertisement

Best Feel good korean series on OTT : కొరియన్ డ్రామాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే వీటిలో కొన్ని సిరీస్ లు జీవితాన్ని కళ్ళముందు ఉంచుతాయి. ఒంటరితనంతో బాధపడేవాళ్లకు, మనసు ప్రశాంతతను కోరుకునేవాళ్లకు ఈ కొరియన్ సిరీస్‌లు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. గుండెకు హత్తుకునే ఎమోషన్స్ తో జీవితంపై నమ్మకాన్ని పెంచేలా ఉండే ఈ ఐదు కథలు నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ఉన్నాయి. వీటిని వీకెండ్ లో ఫ్యామిలీతో చూస్తే మంచి ఫీల్ ఉంటుంది.

1. మై లిబరేషన్ నోట్స్ (My Liberation Notes)

జీవితంలో ఎలాంటి మలుపులు లేక, రోజువారీ రొటీన్ పనులతో విసిగిపోయిన ముగ్గురు తోబుట్టువుల కథ ఇది. వీళ్ళు తమకంటూ ఒక గుర్తింపును వెతుక్కునే ప్రయాణాన్ని ఇందులో చూపించారు. ఇందులో పాత్రలు మన పక్కింటి వాళ్లలాగే అనిపిస్తాయి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండే వెలితిని, ఒంటరితనాన్ని ఈ సిరీస్ చాలా అందంగా చూపిస్తుంది. జీవితంలో బోర్ కొట్టేసినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సిరీస్ చూస్తే ఒక తెలియని ఊరట లభిస్తుంది.

2. డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (Daily Dose of Sunshine)

Advertisement

మానసిక వార్డులో కొత్తగా చేరిన ఒక నర్సు జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అక్కడ ఉండే రోగుల బాధలను, వాళ్ల మానసిక స్థితిని ఆమె ఎలా అర్థం చేసుకుంది, వాళ్లకు ఎలా సాయం చేసిందనేది ఇందులో మెయిన్ పాయింట్. మానసిక సమస్యలు, డిప్రెషన్, ఒంటరితనం అనేవి ఎంత ప్రమాదకరమో, వాటిని ప్రేమతో ఎలా నయం చేయవచ్చో ఇందులో చాలా సున్నితంగా చూపించారు. పేరుకు తగ్గట్టే ఈ సిరీస్ చూస్తుంటే మనసులోకి ఒక కొత్త వెలుగు, ఆశ వచ్చినట్లు అనిపిస్తుంది.

3. మూవ్ టు హెవెన్ (Move To Heaven)

చనిపోయిన వాళ్ల గదులను సర్ది, వాళ్ల వస్తువులను జాగ్రత్త చేసే “ట్రామా క్లీనర్స్” కథ ఇది. ఆటిజం ఉన్న ఒక కుర్రాడు, అతని బాబాయ్ కలిసి ఈ పని చేస్తుంటారు. మరణం వెనుక ఉండే బాధను, బంధాల విలువను ఈ సిరీస్ కళ్లకు కడుతుంది. ప్రతి ఎపిసోడ్ మన కన్నీళ్లు తెప్పిస్తూనే, బతికున్నప్పుడు మనుషులను ఎలా ప్రేమించాలో నేర్పుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ గుండెను బరువెక్కించి, ఆ వెంటనే తేలిక చేసే అద్భుతమైన కథ ఇది.

4. మై మిస్టర్ (My Mister)

Advertisement

జీవితంలో తీవ్రమైన కష్టాలు అనుభవిస్తూ, సమాజంపై నమ్మకం కోల్పోయిన ఇరవై ఏళ్ల అమ్మాయి.. అన్ని ఉన్నా మానసిక ప్రశాంతత లేని ఒక నలభై ఏళ్ల వ్యక్తిని కలుస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ల జీవితాలను ఎలా మార్చుకున్నారనేదే కథ. కొరియన్ డ్రామాల్లోనే ఇదొక మాస్టర్ పీస్. సమాజంలో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లకు తోడు దొరికితే లైఫ్ ఎంత బాగుంటుందో ఇందులో చూడొచ్చు. ఈ సిరీస్ చూశాక లోకంలో ఇంకా మంచి తనం మిగిలే ఉందనే నమ్మకం ఖచ్చితంగా కలుగుతుంది.

5. టుమారో (Tomorrow)

జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్లను కాపాడటానికి నరకం నుంచి వచ్చిన కొంతమంది యమదూతలు ఏం చేశారనేదే ఈ సిరీస్ కాన్సెప్ట్. బతకడం కన్నా చావడం మేలు అనుకునే వాళ్లకు ఈ సిరీస్ ఒక కంటి తుడుపు లాంటిది. ఒంటరితనం, ఆందోళన వల్ల వచ్చే ఆత్మహత్య ఆలోచనలను దూరం చేసి, జీవితం ఎంత విలువైందో ఈ కథ గుర్తుచేస్తుంది.

Read Also : వారానికి ఒకసారి వచ్చే ఏకాంత సమయం… పెళ్ళి తర్వాత కూడా పక్క చూపులు… అన్నీ అలాంటి సీన్లే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×