E-Paper
Advertisement

థియేటర్లను షేక్ చేసిన అడ్వెంచర్ సినిమాలు… ఒక్కో సినిమా ఒక ఆణిముత్యం

థియేటర్లను షేక్ చేసిన అడ్వెంచర్ సినిమాలు… ఒక్కో సినిమా ఒక ఆణిముత్యం
Advertisement

Best Adventure movies on OTT : ఈ రోజుల్లో ఎంత పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్ ఫోన్లు వచ్చినా, థియేటర్‌లో కూర్చుని ఈలలు వేస్తూ సినిమా చూసే మజానే వేరు. సినిమా ప్రపంచంలో ఎన్నో జోనర్లు ఉన్నా, అడ్వెంచర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. సీట్లో కూర్చున్న ప్రేక్షకుడిని అడవులు, ఎడారులు, గుహల్లోకి తీసుకెళ్లి ఊపిరి బిగబట్టేలా చేసే ఆరు ఆణిముత్యాల లాంటి సినిమాల గురించిన ఇప్పుడు చెప్పుకుందాం. ఎప్పుడో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాలు, ఇప్పుడు కూడా చూడటం మొదలు పెడితే చివరిదాకా కదలరు. అంటే ఈ సినిమాలను ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు.

1. Raiders of the Lost Ark (1981)

హారిసన్ ఫోర్డ్ హీరోగా, స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అడ్వెంచర్ సినిమాలకు ఒక బెంచ్‌మార్క్. చేతిలో కొరడా, తలపై హ్యాట్ వేసుకుని ఇండియానా జోన్స్ చేసే సాహసాలు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. నాజీల కంటే ముందే ఒక పవిత్రమైన పెట్టెను కనిపెట్టడానికి హీరో చేసే ప్రయాణం ప్రతి సెకండ్ ఉత్కంఠ రేపుతుంది. ఈ సినిమా ప్రస్తుతం Netflix ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే Apple TV లో అద్దెకు అందుబాటులో ఉంది.

2. Indiana Jones and the Last Crusade (1989)

Advertisement

ఇండియానా జోన్స్ సిరీస్‌లో వచ్చిన మరో అద్భుతమైన చిత్రం ఇది. ఇందులో హీరో తన తండ్రితో కలిసి అమరత్వాన్ని ఇచ్చే ఒక వస్తువు కోసం వెతుకుతుంటాడు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే కామెడీ సీన్లు, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులు అప్పట్లో థియేటర్లను ఊపేశాయి. ఈ క్లాసిక్ సినిమాను Netflix, JioHotstar లలో చూడవచ్చు.

3. Jurassic Park (1993)

డైనోసార్ల ప్రపంచాన్ని కళ్లముందు ఉంచిన విజువల్ వండర్ ఇది. ఒక దీవిలో కృత్రిమంగా సృష్టించిన డైనోసార్ల పార్కులో సిస్టమ్ ఫెయిల్ అయి, అవి బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే పాయింట్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డుల దుమ్ముదులిపింది. వాటి గర్జన వింటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ విజువల్ వండర్ Netflix, Zee5 లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

4. The Mummy (1999)

Advertisement

ఈజిప్ట్ పిరమిడ్లు, మమ్మీల చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థియేటర్లలో ఒక ఊపు ఊపింది. బ్రెండన్ ఫ్రేజర్ యాక్షన్, అమన్‌హోటెప్ అనే ఒక శాపగ్రస్త మమ్మీ చేసే వినాశనం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చాయి. హారర్, కామెడీ, అడ్వెంచర్ అన్నీ సమపాళ్లలో కుదిరిన సినిమా ఇది. ఈ సినిమాను Netflix, Zee5 లో తెలుగులో హ్యాపీగా చూడవచ్చు.

5. The Goonies (1985)

ఒక చిన్నపిల్లల గ్యాంగ్ పాత కాలపు పైరేట్ నిధి కోసం వెతికే అడ్వెంచర్ స్టోరీ ఇది. చిన్నపిల్లల సినిమా అయినా పెద్దవాళ్లను సైతం కట్టిపడేసేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. రహస్య గుహలు, ఉచ్చులు, కామెడీ విలన్లు ఈ సినిమాను ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా మార్చాయి. ఈ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

6. The Princess Bride (1987)

ఇదొక విచిత్రమైన ఫాంటసీ అడ్వెంచర్ సినిమా. ఇందులో రాకుమారిని కాపాడటానికి వచ్చే హీరోకి దారిలో ఎందరో కత్తుల వీరులు, రాక్షసులు ఎదురవుతారు. ప్రేమ, కత్తి యుద్ధాలు, అడ్వెంచర్ కలిసిన ఒక ఫీల్ గుడ్ సినిమాగా ఇది నిలిచిపోయింది. ఈ సినిమాను Prime Video లో అద్దెకు తీసుకుని చూడవచ్చు. సినిమా ప్రియులు తమ లైఫ్‌లో ఒక్కసారైనా మిస్ అవ్వకూడని అద్భుతాలు ఇవి. వీకెండ్‌లో వీటిని హోమ్ థియేటర్‌లో వేసుకుని చూస్తే ఆ మజాయే వేరు.

Read Also : ప్రతీ ఎపిసోడ్ ఒక మాస్టర్ పీస్… పక్కా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇవి చూడాల్సిందే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×