E-Paper
Advertisement

ఓటీటీలో మతి పోగొడుతున్న మాస్టర్ పీస్ లు… యాక్షన్ థ్రిల్లర్ లలో ఈ మూడు తోపు మావా

ఓటీటీలో మతి పోగొడుతున్న మాస్టర్ పీస్ లు… యాక్షన్ థ్రిల్లర్ లలో ఈ మూడు తోపు మావా
Advertisement

Best Action Thriller Movies on OTT : ప్రపంచవ్యాప్తంగా వచ్చే సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఒక అడ్డా అయింది. థియేటర్లకి వెళ్ళేకంటే ఇప్పుడు ఓటీటీలలో సినిమాలను చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఇక వీటిలో కొన్ని అద్భుతమైన సినిమాలు కూడా ఉంటాయి. వీటిని చూసేకొద్ది చూడాలనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ ప్రియులకు మూడు సినిమాలు ఒక మంచి విందు భోజనం తిన్న ఫీలింగ్ ఇస్తున్నాయి. అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన స్టంట్స్, బలమైన కథనాలతో ఈ చిత్రాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ మూడు సినిమాల గురించి, అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయో ఓ లుక్ వేద్దాం పదండి.

1. Top Gun: Maverick (2022)

హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన ఈ చిత్రం 1986 నాటి ‘టాప్ గన్’కి సీక్వెల్. ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఒక విజువల్ మాస్టర్ పీస్. ఇందులో కెప్టెన్ పీట్ (టామ్ క్రూజ్) 30 ఏళ్ల సర్వీస్ తర్వాత తిరిగి టాప్ గన్ గ్రాడ్యుయేట్‌లకు శిక్షణ ఇవ్వడానికి వస్తాడు. ఒక కఠినమైన షన్‌ను అక్కడ ఎలా పూర్తి చేశాడనేది అసలు కథ. విమానాలతో చేసిన రియలిస్టిక్ స్టంట్స్, టామ్ క్రూజ్ నటన ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ప్రస్తుతం ఇది Amazon Prime Videoలో తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.

2. John Wick: Chapter 4 (2023)

Advertisement

కీను రీవ్స్ నటించిన ఈ ఫ్రాంచైజీ యాక్షన్ సినిమాల స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. మార్షల్ ఆర్ట్స్, గన్ ఫైట్స్ ఇష్టపడే వారికి ఇది ఒక పండగ లాంటిది. తన స్వేచ్ఛ కోసం జాన్ విక్ ‘హై టేబుల్’కు వ్యతిరేకంగా చేసే చివరి పోరాటమే ఈ సినిమా. న్యూయార్క్ నుండి పారిస్ వరకు సాగే ఈ పోరాటంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా పారిస్‌లోని ఆర్క్ డి ట్రయంఫ్ వద్ద జరిగిన ఫైట్ సీన్, టాప్ వ్యూలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇది Lionsgate Play, Amazon Prime Video లో తెలుగులోనూ లభిస్తుంది.

3. One Battle After Another (2025)

ప్రముఖ దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో నటించిన ఈ చిత్రం 2026 ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 6 అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఒక మాజీ విప్లవకారుడు తన కూతురిని రక్షించుకోవడానికి తన శత్రువైన కల్నల్ లాక్‌జాతో చేసే పోరాటమే ఈ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. డికాప్రియో నటన, ఫాదర్-డాటర్ బాండింగ్‌తో పాటు సాగే హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు ఈ సినిమాకు ఆస్కార్‌ను తెచ్చిపెట్టాయి. ఈ లేటెస్ట్ మాస్టర్ పీస్ ప్రస్తుతం JioHotstar లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : 40 ఏళ్ళ బ్యాచిలర్… 35 సార్లు రిజెక్షన్… ఇకనైనా పెళ్ళవుతుందా? నలభైలో మొదలైన నయా లవ్ స్టోరీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×