E-Paper
Advertisement

ఓటీటీలో అబ్బురపరుస్తున్న యాక్షన్ థ్రిల్లర్లు… ఒక్క సినిమా చూసినా బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది

ఓటీటీలో అబ్బురపరుస్తున్న యాక్షన్ థ్రిల్లర్లు… ఒక్క సినిమా చూసినా బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది
Advertisement

Best Action Thriller Movies on OTT : దుమ్మురేపే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ యుద్ధభూమిలో జరిగే వార్ సీన్స్ ను కళ్లార్పకుండా చూసే ఆడియన్స్ ఓటీటీ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్. ఈరోజు యాక్షన్, క్రైమ్, సస్పెన్స్ జానర్లో ట్రెండ్ సెట్టర్లుగా నిలిచిన 7 ఐకానిక్ సినిమాల గురించి తెలుసుకుందాం.

One Battle After Another (2025)

2025లో వచ్చిన ఒక చైనీస్ పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా మూవీ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’. యుద్ధభూమిలో ఒక సైనికుడు తన ప్రాణాలను, తోటి సైనికులను కాపాడుకోవడానికి నిరంతరం చేసే ఎమోషనల్ పోరాటాన్ని ఇందులో చూడవచ్చు.

Gangs of Wasseypur (2012)

Advertisement

భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైండ్-బ్లోయింగ్ గ్యాంగ్‌స్టర్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’. ఈ మాస్టర్ పీస్ సిరీస్ లో ధన్‌బాద్‌ లోని బొగ్గు మాఫియా నేపథ్యంలో షాహిద్ ఖాన్, సుల్తానా డాకు, సర్దార్ ఖాన్, ఫైజల్ ఖాన్ల కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయి. 3 తరాల పాటు సాగే పగ, ప్రతీకారాల బ్లడీ బ్లడ్ బాత్ ఈ మూవీ.

Kill Bill: Vol. 1 (2003)

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బెస్ట్ రివేంజ్ డ్రామా ‘కిల్ బిల్’. ‘ది బ్రైడ్’ అనే మాజీ అస్సాసిన్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. పెళ్లి రోజున తనను చంపడానికి ప్రయత్నిస్తాడు పాత బాస్. దీంతో బిల్ బాస్ తో పాటు అతని గ్యాంగ్‌ పై కత్తి పట్టి ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది ఈ మూవీ స్టోరీ.

Oldboy (2003)

Advertisement

ఇక కొరియన్ మాస్టర్ పీస్ ‘ఓల్డ్‌బాయ్’. ఇందులో ఓ వ్యక్తిని 15 ఏళ్ల పాటు ఒక గదిలో బంధిస్తారు. కారణం లేకుండా ఈ పనిని ఎవరు చేశారో తెలీదు. సడన్ గా అతన్ని రిలీజ్ చేయడంతో అసలు ఎవరు, ఎందుకు ఇలా తనను కిడ్నాప్ చేశారో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఈ క్రమంలో వచ్చే షాకింగ్ క్లైమాక్స్ ఆడియన్స్ ను ఉలిక్కిపడేలా చేస్తుంది.

The Dark Knight (2008)

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన మరో మాస్టర్ పీస్ ‘ది డార్క్ నైట్’. ఈ లెజెండరీ సూపర్ హీరో సినిమాలో గోథమ్ నగరంలో శాంతిని పాడు చేయడానికి వచ్చిన సైకో విలన్ ‘జోకర్’ (హిత్ లెడ్జర్) గురించి ఉంటుంది కథ. అతను విసిరే సవాళ్లను బ్యాట్‌మన్ ఎలా తిప్పికొట్టాడు అన్నది కథ.

Heat (1995)

హాలీవుడ్ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హీట్’. ప్రొఫెషనల్ బ్యాంక్ దొంగల ముఠా నాయకుడు, అతన్ని పట్టుకోవాలని పరుగులు తీసే అగ్రెసివ్ లాస్ ఏంజిల్స్ పోలీస్ డిటెక్టివ్ మధ్య సాగే మైండ్ గేమ్స్ ఇందులో ఆసక్తికరంగా ఉంటాయి.

Children of Men (2006)

అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ థ్రిల్లర్ ‘చిల్డ్రన్ ఆఫ్ మెన్’. 2027 నాటి కాలంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఆ టైమ్ లో మనుషులలో సంతానోత్పత్తి శక్తి నశించిపోవడంతో ఒక్క మనిషి కూడా పుట్టని పరిస్థితి ఉంటుంది. మానవజాతి అంతరించిపోయే తరుణంలో, గర్భం దాల్చిన ఆఫ్రికన్ యువతి గర్భం దాల్చగా… ఆమెను సురక్షితంగా సైంటిస్టుల దగ్గరకు చేర్చడానికి హీరో థియో తన ప్రాణాలను పణంగా పెట్టిన స్టోరీనే ఈ సినిమా.

Read Also : 200000 కోట్ల ఆస్తి కోసం 7 హత్యలకు స్కెచ్… నవ్వులు పూయిస్తూనే ఉత్కంఠ రేకెత్తించే మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×