E-Paper
Advertisement

నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిన బెస్ట్ యాక్షన్ మూవీస్… వీటిని చూడటం స్టార్ట్ చేస్తే ఆపలేరు

నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిన బెస్ట్ యాక్షన్ మూవీస్… వీటిని చూడటం స్టార్ట్ చేస్తే ఆపలేరు
Advertisement

Best Action Movies on Netflix : నేటి కాలంలో థియేటర్లకు వెళ్లకపోయినా, ఇంట్లోనే కూర్చుని వెండితెర అనుభూతిని పొందేలా ఓటీటీలు మనకు దగ్గరయ్యాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్ ఫామ్ మంచి కంటెంట్ ను ఇవ్వడంలో ముందు వరసలో ఉంటుంది. ఇందులో యాక్షన్ ప్రియుల కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. మీరు మిస్ అవ్వకూడదు అనుకునే అద్భుతమైన యాక్షన్ సినిమాల గురించి ఓ లుక్ వేద్దాం.

1.Casino Royale (2006)

జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ క్రెయిగ్ కెరీర్ ప్రారంభించిన ఈ చిత్రం ఒక క్లాసిక్. స్టైలిష్ యాక్షన్, హై-స్టేక్స్ పోకర్ గేమ్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాను మాస్టర్‌పీస్‌గా నిలబెట్టాయి.

2. Godzilla Minus One (2023)

Advertisement

జపాన్ నుంచి వచ్చిన ఈ విజువల్ వండర్ ఇటీవలి కాలంలో బెస్ట్ యాక్షన్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా కావాల్సినంత థ్రిల్ ఇస్తుంది.

3. Train to Busan (2016)

యాక్షన్, హారర్ కలిపి ఉండే కొరియన్ మూవీ ఇది. ఒక రైలు ప్రయాణంలో జాంబీల దాడి నుంచి ప్రాణాలు ఎలా కాపాడుకున్నారనేది కళ్లు చెదిరే యాక్షన్‌తో చూపించారు. ఇందులో తండ్రి కూతురు మధ్య ఎమోషన్ మిమ్మల్ని కదిలిస్తుంది.

4. Mosul (2019)

Advertisement

ఒక సిటీని కాపాడుకోవడానికి పోలీసులు జరిపే పోరాటం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అత్యంత సహజంగా సాగే వార్ డ్రామా ఇది. రఫ్ అండ్ టఫ్ యాక్షన్ ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

5. Deepwater Horizon (2016)

నిజ జీవితంలో జరిగిన చమురు గని ప్రమాదం ఆధారంగా తీసిన సినిమా ఇది. సముద్రం మధ్యలో ఒక ప్లాట్‌ఫాం పేలిపోయినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి సిబ్బంది పడే తపన, అగ్నిప్రమాద దృశ్యాలు చాలా భయానకంగా, ఉత్కంఠభరితంగా ఉంటాయి.

6. Da 5 Bloods (2020)

స్పైక్ లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. వియత్నాం యుద్ధంలో పాల్గొన్న నలుగురు నల్లజాతి సైనికులు, బంగారం కోసం చేసే అడ్వెంరే ఈ కథ.

7. Okja (2018)

ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఒక బాండింగ్ మూవీ కూడా. ఒక భారీ జీవిని కార్పొరేట్ కంపెనీల నుంచి కాపాడుకోవడానికి ఒక చిన్నారి చేసే పోరాటం అద్భుతంగా ఉంటుంది.

8. Independence Day (1996)

ఏలియన్స్ భూమిపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? విల్ స్మిత్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఎవర్ గ్రీన్. భారీ స్థాయిలో ఉండే విధ్వంసకర దృశ్యాలు ఈ సినిమా స్పెషాలిటీ.

9. The Siege of Jadotville (2017)

1961లో కాంగోలో ఐరిష్ సైనికులు తక్కువ మంది ఉండి కూడా భారీ శత్రు సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సినిమా కథ. వార్ మూవీస్ ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది.

10. RRR (2022)

మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని చాటిన చిత్రం ఇది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటాపోటీగా నటించిన ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది గ్లోబల్ ట్రెండ్‌లో నిలిచింది.

ఈ సినిమాలన్నీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. వీకెండ్‌లో హోమ్ థియేటర్ ఆన్ చేసి ఈ దమ్మున్న సినిమాలతో ఎంజాయ్ చేయండి.

Read Also : 90s లో ప్రతి సంవత్సరం సంచలనం సృష్టించుకుంటూ పోయిన సినిమాలు… వీటిని చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×