E-Paper
Advertisement

Bengali Thriller OTT : భార్య మిస్సింగ్ తో మొగుడి వేదన… ఓటీటీలోకి వచ్చేసిన బెంగాలీ థ్రిల్లర్

Bengali Thriller OTT : భార్య మిస్సింగ్ తో మొగుడి వేదన… ఓటీటీలోకి వచ్చేసిన బెంగాలీ థ్రిల్లర్
Advertisement

Bengali Thriller OTT : గత ఏడాది థియేటర్లలో సందడి చేసిన బెంగాలీ సైకాలజికల్ థ్రిల్లర్ ‘ఒపోరిచిటో’ (Oporichito). UK నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ సినిమా, క్రైమ్, మెమరీ లాస్ థీమ్‌ తో నడుస్తుంది. ఆశ్చర్యకరమైన కథనం, ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా బెంగాలీ థ్రిల్లర్ జానర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. IMDbలో 7.8 రేటింగ్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మిస్ అయినవాళ్ళు ఇప్పుడు ఓటీటీలో ఆస్వాదించవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పుడు అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పటినుంచి అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

జయ్‌దీప్ ముఖర్జీ దర్శకత్వంలో రిత్విక్ చక్రవర్తి, అనిర్బన్ చక్రవర్తి నటించిన ఈ చిత్రం 2025 జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ బెంగాలీ చిత్రం ఫిబ్రవరి 20 నుంచి ప్రైమ్ వీడియోలో అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎస్కే మూవీస్ పతాకంపై అశోక్ ధనుకా, హిమాన్షు ధనుకా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం యునైటెడ్ కింగ్‌డమ్ లో జరిగింది. అక్కడి అందమైన లోకేషన్లు కూడా సినిమాలోని థ్రిల్లర్ మూడ్‌ను పెంచాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లండన్‌లో సెటిల్ అయిన రంజన్ (రిత్విక్ చక్రవర్తి) ఒక భయంకరమైన కారు ప్రమాదంలో మెమరీ లాస్‌తో బాధపడుతుంటాడు. ఆ ప్రమాదంలో అతనితో పాటు ఉన్న భార్య రియా (ఇషా సాహా) అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. రంజన్ తన చుట్టూ ఒక పెద్ద కుట్ర జరుగుతోందని అనుమానిస్తాడు. తన స్నేహితులు, సహోద్యోగులు, పోలీసులుతో సహా ఎవరినీ నమ్మలేకపోతాడు. అతని భార్య రియా ప్రమాదానికి కారణమైన సంఘటనల్లో ప్రధాన అనుమానితురాలిగా మారుతుంది. అసలు తన భార్య ఏమైంది? తనపై దాడి చేసింది ఎవరు? తన చుట్టూ ఉన్నవాళ్లు నిజం చెబుతున్నారా ? తనను పిచ్చోడిని చేయాలని చూస్తున్నారా ? అన్నది ఈ సినిమాలో ఉత్కంఠను కలిగిస్తుంది. పోలీసు ఆఫీసర్ అవిక్ (అనిర్బన్ చక్రవర్తి) ఈ కేసును దర్యాప్తు చేస్తూ, రంజన్ గతం గురించి షాకింగ్ విషయాలు బయటపెడతాడు. రంజన్ గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించే కొద్దీ కొత్త సెక్రెట్స్ వెలుగులోకి వస్తాయి. ఒక సాధారణ మిస్సింగ్ కేస్ కాస్తా పెద్ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌గా ఎలా మారింది? చివరికి రంజన్ తన భార్యను కనుగొన్నాడా ? అనేదే ఈ సైకోలాజికల్ థ్రిల్లర్ క్లైమాక్స్.

Read Also : రాత్రి పూట నరకం చూపించే మిస్టీరియస్ మ్యాన్… ప్రతి నిమిషం ఉత్కంఠతే… కిరాక్ కన్నడ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×